ఒడిశా నది ఒడ్డున మనిషి పుర్రెలు..! నరబలులా? క్షుద్రపూజలా?!!

  • Published By: nagamani ,Published On : May 30, 2020 / 06:15 AM IST
ఒడిశా నది ఒడ్డున మనిషి పుర్రెలు..! నరబలులా? క్షుద్రపూజలా?!!

ఒడిశా కటక్ జిల్లాలోని జగత్ పూర్ సమీపంలోని ఓ నదీ తీరంలో శుక్రవారం (మే29,2020) మానవ పుర్రెలు బైటపడ్డాయి. ఈ సంఘటనతో స్థానికులో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా తిర్తోల్‌ పోలీసు స్టేషన్‌ పరిధి కృష్ణనందపుర గ్రామంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణనందపుర ఔట్‌పోస్టు పోలీసు అధికారి అనిరుద్ధ నాయక్‌ సందిగ్ధ ప్రాంతాల్ని సందర్శించి రెండు ప్రాంతాల్లో 4 పుర్రెల్ని కనుగొన్నారు. ఆ కపాలాలకు సమీపంలో పువ్వులు..పసుపు..కుంకుమ..ఓ మట్టికుండా కూడా కనిపించాయి. 

దీనిపై సమాచారం అందుకున్న పోలీసుల బృందం ఘటనాస్థలానికి చేరుకుంది. పరిసరాలను పరిశీలించింది. మానవ పుర్రెలతో  క్షుద్రపూజలు చేసిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన విచారణ చేస్తున్నామనీ సీనియర్ పోలీసులు అధికారి దీపక్ రంజన్ జెనా తెలిపారు.  

కాగా..కటక్ జిల్లాలోని నరసింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంధహుడా ప్రాంతంలోని బ్రాహ్మణి దేవాలయ పూజారి ఆలయ ప్రాంగణంలోనే ఓ వ్యక్తిని నరబలి ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి అంతం కోసం సరోజ్ ప్రధాన్‌ ను నరబలికి పూజారి పాల్పడినట్లుగా తెలిసింది.

నిందితుడు పూజారి.. సంసారీ ఓజా  తనకు కలలో ఒక దేవత ప్రత్యక్ష్మై …కరోనావైరస్ నిర్మూలనకు ఓ మనిషిని బలి ఇస్తే..ఆ మహమ్మారి శాంతిస్తుందనీ దీంతో ప్రజలకు కరోనా పీడ విరగడ అవుతుందని చెప్పిందనీ..అందుకే ప్రధాన్ ను బలి చేయవలసి వచ్చిందని చెప్పాడు.

Read: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ మిస్సింగ్ అంటూ పోస్టర్లు