ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ నియోగదారులకు శుభవార్త అందించింది. కస్టమర్లకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకుంది.

  • Published By: veegamteam ,Published On : April 16, 2020 / 09:54 AM IST
ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ నియోగదారులకు శుభవార్త అందించింది. కస్టమర్లకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకుంది.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ నియోగదారులకు శుభవార్త అందించింది. కస్టమర్లకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకుంది. గత నెలలో మినిమం బ్యాలెన్స్ మెయింటనెన్స్ పై ఛార్జీలను ఎత్తివేసిన ఎస్ బీఐ..తాజాగా ఏటీఎం విత్ డ్రాయల్స్ పై సర్వీస్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎస్ బీఐ ఏటీఎం కార్డులతో ఎన్నిసార్లైనా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. 

అంతేకాకుండా ఎస్ బీఐ ఏటీఎంలే కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి కూడా ఎస్ బీఐ ఏటీఎం కార్డులతో ఎన్నిసార్లైనా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చని ఎస్ బీఐ అధికారులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ వెసులుబాటు (జూన్ 30, 2020) వరకే వర్తిస్తుందని ఎస్ బీఐ వెల్లడించారు. 

Also Read | లాక్ డౌన్ వేళ షాక్ ఇస్తున్న బంగారం

ఎస్ బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో మంచి నిర్ణయం తీసుకుందని కొనియాడతున్నారు. ఈ నిర్ణయం ఎస్ బీఐ కస్టమర్లకే కాకుండా ఇతర బ్యాంకు కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంది. 
 

See Also | కరోనా ఎలా వ్యాపిస్తుందో ఇటుకలతో చూపించిన చిన్నారులు.. పిల్లలు నేర్పిన పెద్ద పాఠమన్న మోడీ