Google : గూగుల్ కొరడా, భారీగా కంటెంట్ తొలగింపు..ఫిర్యాదుల కారణంగానే ?

సామాజిక మాధ్యమాల్లో ప్రధాన స్థానంగా ఉన్న గూగుల్ (Google) కొరడా ఝులిపిస్తోంది. కంటెంట్ విషయంలో చర్యలకు దిగుతోంది. సైకోలు, కాపీపేస్ట్, వివాదాస్పద అంశాలు, సెక్సువల్ కంటెంట్ అప్ లోడ్, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొంటోంది. అందులో భాగంగా..అభ్యంతరకరంగా ఉన్న కంటెంట్ ను పెద్ద ఎత్తున తొలగిస్తోంది.

Google : గూగుల్ కొరడా, భారీగా కంటెంట్ తొలగింపు..ఫిర్యాదుల కారణంగానే ?

Google

Google Removes Content : సామాజిక మాధ్యమాల్లో ఒకటైన గూగుల్ (Google) కొరడా ఝులిపిస్తోంది. కంటెంట్ విషయంలో చర్యలకు దిగుతోంది. సైకోలు, కాపీపేస్ట్, వివాదాస్పద అంశాలు, సెక్సువల్ కంటెంట్ అప్ లోడ్, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొంటోంది. అందులో భాగంగా..అభ్యంతరకరంగా ఉన్న కంటెంట్ ను పెద్ద ఎత్తున తొలగిస్తోంది.

సెర్చింజన్ లో గూగుల్ నెంబర్ వన్ అనే సంగతి తెలిసిందే. అయితే..కంటెంట్ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తుండడంతో గూగుల్ అప్రమత్తమైంది. వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా చర్యలకు దిగుతోంది. గత మూడు నెలల కాలంలో..ఇండియాకు సంబంధించి ఏకంగా 13.78 లక్షల కంటెంట్ ను గూగుల్ తొలగించింది. కేంద్ర ప్రభుత్వం…ఇటీవలే కొత్త ఐటీల చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలను అనుసరించి..వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా..గూగుల్ ఇప్పటి వరకు 2,17,095 కంటెట్ తొలగించగా ఆటోమేషన్ పద్ధతిలో ఇంతకు పదింతల సంఖ్యలో అభ్యంతరకరంగా, వివాదాస్పద సమాచారాన్ని గూగుల్ డిలీట్ చేసేసింది.

ఆటోమేషన్ లో తొలగించిన కంటెంట్ మేలో 6,34,357 ఉండగా..జూన్ లో 5,26,866గా నమోదైంది. ఇందులో ఎక్కువగా…చిన్నారులను లైంగికంగా వేధించడం, జుగుప్సాకరమైన హింసకు సంబంధించిన కంటెంట్ ఉన్నట్లు గూగుల్ వెల్లడిస్తోంది. స్థానిక చట్టాలకు లోబడి…అభ్యంతరకరంగా ఉన్న..నేర పూరిత, చట్ట విరుద్ధమైన కంటెంట్ ఉందంటూ గూగుల్ కు భారీ ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. తమ కంటెంట్ ను మరెవరో పోస్టు చేశారని..తమ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ…గూగుల్ కు వ్యక్తిగతంగా ఫిర్యాదులు అందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

ఏప్రిల్‌లో 27,700 మంది ఫిర్యాదు చేయగా 59,350 వివిధ కంటెంట్‌లని గూగుల్‌ తొలగించింది,
మే నెలలో 34,883 ఫిర్యాదులు అందితే..71,132 కంటెంట్‌లపై చర్యలు తీసుకుంది.
ఇక జూన్‌ నెలలో 36,265 కంప్లైంట్స్‌ రాగా… గూగుల్‌ 83,613​కి తొలగించింది.