Uttar Pradesh : కట్నంగా ట్రాక్టర్ డిమాండ్ చేసిన వరుడు .. ఆ ట్రాక్టర్‌కే తాళి కట్టుకో..దాంతోనే కాపురం చేస్కో అంటూ పెళ్లి వద్దు పొమ్మన్న వధువు

కొన్నిసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా ట్రాక్టర్ డిమాండ్ చేసాడు వరుడు .. ఆ ట్రాక్టర్‌కే తాళి కట్టుకో..దాంతోనే కాపురం చేస్కో అంటూ పెళ్లి వద్దు పొమ్మంది వధువు.

Uttar Pradesh : కట్నంగా ట్రాక్టర్ డిమాండ్ చేసిన వరుడు .. ఆ ట్రాక్టర్‌కే తాళి కట్టుకో..దాంతోనే కాపురం చేస్కో అంటూ పెళ్లి వద్దు పొమ్మన్న వధువు

Groom held hostage by bride’s family for demanding tractor just before wedding

Uttar Pradesh : నగలు,నగదు,ఫ్రిజ్ తో పాటు ఇంటికి సరపడా అన్ని ఫర్నీచర్లు కట్నంగా ఇచ్చినా ఆ వరుడుకి సరిపోలేదు. ట్రాక్టర్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని డిమాండ్ చేశాడు. పెళ్లికి బంధువలందరిని పిలుచుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి మండపానికి రావాల్సిన సమయంలో అదను చూసుకుని ట్రాక్టర్ కూడా ఇస్తేనే గానీ పెళ్లికి రానని డిమాండ్ చేశాడు వరుడు. దీంతో ఆడపెళ్లివారు షాక్ అయ్యారు. తీరా పెళ్లి జరగాల్సిన సమయంలో ఇటువంటి డిమాండ్ ఏంటీ..అడిగినవన్నీ ఇచ్చాంగా అని కంగారుపడ్డారు. ఆందోళన చెందారు. ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చారు. వరుడు కోరిన ట్రాక్టర్ కూడా కట్నంగా ఇస్తాం అని చెప్పి మగపెళ్లివారిని రమ్మన్నారు.

ఇంకేముంది తన డిమాండ్ నెరవేరుతోంది కదాని వరుడు, అతనితో పాటు మగపెళ్లివారు మందీ మార్బలంతో ఉత్సాహంగా వచ్చేశారు. తీరా వచ్చాక ఆడపెళ్లివారి చేసిందానికి బిత్తరపోయారు. బాబోయ్ మీకో దణ్ణం మమ్మల్ని వదలేయమని బతిమాలుకున్నారు. దీంతో ఆడపెళ్లివారు వరుడికి మగపెళ్లివారికి గట్టిగా బుద్ధి చెప్పి వదిలిపెట్టేశారు. వధువు ఇటువంటివాడు నాకు భర్తగా వద్దు పొమ్మంది. దీంతో అడిగింది దక్కక..పెళ్లి జరగక దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుండగా మొహాలు దిగాలేసుకుని వెళ్లిపోయారు వరుడుతో పాటు మగపెళ్లివారంతా..ఇంతరీ ఆడపెళ్లివారు ఏం చేశారంటే..

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోని కుల్హారీ గ్రామానికి చెందిన యువతికి షామ్లీలోని భైంసాని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన యువకుడికి వివాహం నిశ్చయమైంది. నగలు,నగదుతోపాటు ఇతర ఫర్నీచర్ కట్నంగా ఆడపెళ్లివారితో ఒప్పందాలు అయ్యాయి. ఇక వివాహానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. గత మంగళవారం (మార్చి14,2023)న వివాహం జరగాల్సి ఉంది. ఈక్రమంలో మగపెళ్లివారు సోమవారం (మార్చి13)న కట్నంగా ట్రాక్టర్ కావాలని డిమాండ్ చేశాడు వరుడు. మరునాడే పెళ్లి జరగాల్సి ఉండగా ఇప్పుడీ అదనపు డిమాండ్స్ ఏంటీ అని అడిగారు వధువు బంధువులు. దానికి ట్రాక్టర్ ఇస్తేనే పెళ్లికి వస్తామని లేకుంటే లేదని తెగేసి చెప్పాడు వరుడు.

దీంతో ఆడపెళ్లివారికి మండిపోయింది. సరే ఇస్తాం రమ్మన్నారు. మగపెళ్లివారు బారాత్ గా వచ్చారు. వచ్చీరాగానే వరుడిని అతని కుటుంబ సభ్యుల్ని తాళ్లతో కట్టేశారు. దీంతో దిమ్మతిరిగిపోయింది వారికి. కొత్త ట్రాక్టర్‌ తీసుకొచ్చి..పెళ్లికూతురుకు బదులుగా ట్రాక్టర్‌తోనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. దాంతో దెబ్బకు దిగి వచ్చిన అబ్బాయి తరపు వారు. వధువు సీన్ లోకి వచ్చింది. ఈ ట్రాక్టర్ కే తాళి కట్టుకో..దాంతోనే కాపురం చేసుకో నువ్వు వద్దూ..నీతో పెళ్లి వద్దు పొమ్మని చెప్పింది.

దీంతో అడిగింది దక్కక పరువు పోయి వదలిపెట్టమని ఆడపెళ్లివారిని బతిమాలుకున్నారు వరుడు తరపువారు. దీంతో మీకు ఇప్పటివరకు ఇచ్చిన నగదుతో పాటు పెళ్లి కోసం చేసిన ఖర్చులు కూడా ఇస్తేనే వదులుతామని డిమాండ్ చేశారు. వేరే దారిలేక అలాగే ఇస్తామని అంగీకరించారు వరుడు..అతని కుటుంబ సభ్యులు. దాంతో వారందరిని వదిలారు ఆడపెళ్లివారు. దీంతో బతుకు జీవుడా అంటూ తెల్లముఖాలు వేసుకుని వెళ్లిపోయారు వరుడు, అతని బంధువులు.

ఈ ఘటనపై పెళ్లికూతురు మేనమామ మహ్మద్‌ మాట్లాడుతూ.. మా అమ్మాయి పెళ్లి కోసమని నగలు, నగదుతో పాటు ఇంటికి సరిపడా ఫర్నీచర్‌ అంతా కొన్నామని..అవన్నీ నాలుగు రోజుల క్రితమే అన్నీ వరుడి ఇంటికి పంపించామని తెలిపారు. కానీ పెళ్లి మరునాడు అనగా ట్రాక్టర్ కొనిస్తేనే పెళ్లికి వస్తాం లేదంటే పెళ్లి క్యాన్సిల్ అంటూ డిమాండ్ చేశారని దీంతో మాకు కోపం వచ్చి వారిని రప్పించుకుని తగిన శాస్తి చేయాలనుకున్నామని అందుకే ఇలా చేశామని తెలిపారు. వరుడి డిమాండ్ గురించి తెలుసుకున్న వధువు కూడా నీకీ పెళ్లి వద్దని చెప్పిందని కానీ వరుడికి మాత్రం తగిన బుద్ధి చెప్పాలని కోరిందని దీంతో ఇలా చేశామని తెలిపారు.