జీశాట్ – 31 స్పెషల్  : కమ్యూనికేషన్ మరింత ఈజీ 

  • Published By: veegamteam ,Published On : February 6, 2019 / 06:11 AM IST
జీశాట్ – 31 స్పెషల్  : కమ్యూనికేషన్ మరింత ఈజీ 

కౌరో : వరుస ప్రయోగాల విజయంతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ – 31 ను సక్సెస్ ఫుల్ గా నింగిలోకి పంపించింది ఇస్రో. ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి జీశాట్ – 31 విజయవంతంగా దూసుకుపోవటంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. జీశాట్ స్పెషల్స్.. 

 

  • భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయం 
  • జీశాట్-31 శాటిలైట్‌ను ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగం విజవంతం
  • 42 నిమిషాల వ్యవధిలోనే నిర్ణీత కక్ష్యలోకి దూసుకెళ్లిన జీశాట్ 31 
  • ఇండియా భూభాగాలు, అరేబియా..బంగాళాఖాతం సముద్రాల సరౌండింగ్ లోని ఇన్ఫర్మేషన్ డెవలప్ మెంట్ కోసం జీశాట్ 31 
  • సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్ -4 ఉపగ్రహాన్ని కూడా మోసుకెళ్లిన ఏరియన్ 5 రాకెట్ 
  • 15 ఏళ్లపాటు నిరంతరాయంగా కమ్యూనికేషన్ సర్వీసులు 
  • జీశాట్ 31 బరువు 2,535 కిలోలు 
  • ఇన్‌శాట్‌, జీశాట్‌ ఉపగ్రహాలకు సరికొత్త  రూపంగా ఇస్రో సైంటిస్టుల అభివర్ణన
  • డీటీహెచ్‌ టీవి, డిజిటల్ శాటిలైట్, టీవి అప్‌లింక్స్‌ టెక్నాలజీ జీశాట్ 31 సొంతం