వెదర్ వార్నింగ్ : కేరళకు వర్షాల ముప్పు

వెదర్ వార్నింగ్ : కేరళకు వర్షాల ముప్పు

కేరళకు మరో విపత్తు పొంచి ఉంది.. మండే ఎండాకాలంలో వర్షాల ముప్పు ఉందని హెచ్చరించింది కేరళ వాతావరణ శాఖ. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తనున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. 2019, ఏప్రిల్ 20వ తేదీ శనివారం నుంచి 23వ తేదీ మంగళవారం వరకూ ఎడతెరిపి లేకుండా వానలు పడనున్నట్లు సమాచారం ఇచ్చింది. ఈ నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అక్కడక్కడ పిడుగులు, ఉరుములతో వాతావరణం భయానకంగా ఉండొచ్చని కూడా హెచ్చరించింది. జిల్లాల్లో డిసెంబరు 22వ తేదీ వరూ వర్షాలు భారీగా కురవనున్నట్లు కూడా ముందస్తుగా సూచనలు చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది కేరళ వాతావరణ శాఖ.

ముఖ్యంగా పలక్కాడ్ అనే ప్రాంతంలో ఏప్రిల్ 20 నుంచే వర్షాలు ముంచెత్తనున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికతో.. కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సహాయ చర్యలకు ఆదేశించింది. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. మెరుపు వేగంతో సహాయ చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించింది. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. అవసరమైన ఏర్పాట్లకు కేరళ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.