GST Revenue Collected: 2022 డిసెంబర్‌ నెలలో భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

2022లో జీఎస్టీ ద్వారా నవంబర్ నెలలో రూ. 1.46 లక్షల కోట్లు జమయ్యాయి. కాగా, 2022 డిసెంబర్ నెలలో 1.49 లక్షల కోట్లకు చేరింది. ఇదిలాఉంటే డిసెంబర్ నెలలో ప్రభుత్వానికి వచ్చిన జీఎస్టీ మొత్తం.. 2021 డిసెంబర్ జీఎస్టీ వసూళ్ల కంటే 15శాతం ఎక్కువ అని ప్రభుత్వం తెలిపింది.

GST Revenue Collected: 2022 డిసెంబర్‌ నెలలో భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

GST

GST Revenue Collected: 2022 డిసెంబర్‌లో వసూళ్లయిన జీఎస్టీ (వస్తు సేవల పన్ను వసూళ్లు) డేటా వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. వరుసగా పదవ నెలలో 1.4లక్షల కోట్ల కంటే ఎక్కువగా జీఎస్టీ రాబడిని సాధించినట్లు ట్వీట్ ద్వారా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. గతనెల డిసెంబర్‌లో రూ. 1,49,507 కోట్ల ( 18.07 బిలియన్ డాలర్లు) జీఎస్టీ వసూళ్లు నమోదుకాగా.. ఈ రకంగా చూస్తే జీఎస్టీ వసూళ్లతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరినట్లు తెలస్తుంది.

GST Revenue: 11 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. నవంబర్‌లో రూ.1.46 లక్షల కోట్లు వసూలు

2022లో జీఎస్టీ ద్వారా నవంబర్ నెలలో రూ. 1.46 లక్షల కోట్లు జమయ్యాయి. కాగా, 2022 డిసెంబర్ నెలలో 1.49 లక్షల కోట్లకు చేరింది. ఇదిలాఉంటే డిసెంబర్ నెలలో ప్రభుత్వానికి వచ్చిన జీఎస్టీ మొత్తం.. 2021 డిసెంబర్ జీఎస్టీ వసూళ్ల కంటే 15శాతం ఎక్కువ అని ప్రభుత్వం తెలిపింది. 2022 డిసెంబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1,49,507 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్టీ వాటా రూ. 26,711 కోట్లు, ఎస్‌జీఎస్టీ వాటా రూ. 33,357 కోట్లు, ఐజీఎస్టీ వసూళ్లు రూ. 78,434 కోట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

 

2022 డిసెంబర్ నెలలో సెటిల్మెంట్ ఆదాయంకూడా భారీగానే వసూళైంది. సాధారణ సెటిల్మెంట్‌గా రూ. 36,669 కోట్ల సీజీఎస్టీ వాటాను, రూ. 31,094 కోట్ల ఎస్ జీఎస్టీని ప్రభుత్వం సెటిల్ చేసింది. డిసెంబర్ 2022లో .. రాష్ట్రాలు, కేంద్రం సాధారణ సెటిల్మెంట్ తర్వాత సీజీఎస్టీ కింద రూ. 63,380 కోట్లు, ఎస్ జీఎస్టీ కింద 64,451 కోట్లు వచ్చాయి.