GST Revenue: 11 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. నవంబర్‌లో రూ.1.46 లక్షల కోట్లు వసూలు

జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ నెల జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగాయి. గత నెలలో మొత్తం రూ.1.46 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది.

GST Revenue: 11 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. నవంబర్‌లో రూ.1.46 లక్షల కోట్లు వసూలు

GST Revenue: కొంతకాలంగా జీఎస్టీ వసూళ్లు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అంతకుముందు ఏడాది నవంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగాయి. గడిచిన నెలలో రూ.1.46 లక్షల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు దాటడం వరుసగా ఇది పదోసారి.

Maharashtra: బాలికపై పదిహేనేళ్ల బాలుడి హత్యాచారం.. బాలిక తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దారుణం

ఈ ఏడాదిలో ఫిబ్రవరి మినహా ప్రతి నెలా రూ.1.40 లక్షల కోట్లపైనే జీఎస్టీ వసూలైంది. గత నవంబర్ నెలకు సంబంధించి వసూలైన రూ.1.46 లక్షల కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.25,681 కోట్లుకాగా, స్టేట్ జీఎస్టీ రూ.32,651 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.77,103 కోట్లు, సెస్ రూ.10,433 కోట్లుగా ఉంది. సెస్ వసూళ్లకు సంబంధించి ఇంపోర్టెడ్ గూడ్స్ జీఎస్టీ విలువ రూ.817 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.68 లక్షల కోట్లు వసూలయ్యాయి. తర్వాత అక్టోబర్‌లో రూ.1.52 లక్షల కోట్లు వచ్చాయి.

పన్ను ఎగవేతకు అవకాశం లేకుండా చేయడం ద్వారా జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇక తెలంగాణకు సంబంధించి గత నెలలో రూ.4,228 కోట్ల జీఎస్టీ వసూలుకాగా, ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.3,134 కోట్లు వసూలయ్యాయి.