క్లచ్ లేకుండా కార్.. లాంచ్ చేసిన Hyundai

క్లచ్ లేకుండా కార్.. లాంచ్ చేసిన Hyundai

Hyundai India కొత్త మోడల్ కార్‌ను లాంచ్ చేసింది. ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (iMT)తో Venue సబ్‌కంపాక్ట్ SUVని డిజైన్ చేసింది. SX, SX(O) వేరియంట్స్ తో క్లచ్ లెస్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీని ఆఫర్ చేసింది. లీటర్ కెపాసిటీ ఉన్న T-GDi టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ తో 118bhp, 172Nmల కెపాసిటీ ఉన్న టార్క్ తో మోడల్ రెడీ అయింది. దీని ధర దాదాపు రూ.9.99లక్షల నుంచి రూ.11.08లక్షల వరకూ ఉండొచ్చు.

దీంతోపాటు కార్ మేకర్ మరో న్యూ స్పోర్ట్ ట్రిమ్ ను లాంచ్ చేశారు. ఇది పెట్రలో, డీజిల్ ఆప్షన్లతో నడిచేది. ధర రూ.10.20లక్షల నుంచి రూ.11.52లక్షలు ఉండొచ్చట. న్యూ ఇంటిలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్(iMT).. క్లచ్ ఫ్రీ గేర్ షిఫ్ట్స్ కు వీలుగా ఉంటుంది. గేర్ ప్యాటరన్ Hఆకారంలోనే డిజైన్ చేసింది.

దీనికి గేర్ లు మార్చాల్సిన సమయంలో క్లచ్ ప్లేట్ అవసరమే ఉండదని.. హ్యుండాయ్ చెప్తుంది. హైడ్రాలిక్ ప్రెజర్ క్రియేట్ చేయడానికి హైడ్రాలిక్ ఆక్చుయేటర్‌కు ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ యూనిట్ సిగ్నల్ పంపిస్తుంది. కాన్సెంట్రిక్ స్లేవ్ సిలిండర్(సీఎస్సీ)కి క్లచ్ ట్యూబ్ ద్వారా సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు సీఎస్సీ ప్రెజర్ ను వాడుకుని క్లచ్, ప్రెజర్ ప్లేట్ ను కంట్రోల్ చేస్తుంది. అప్పుడే క్లచ్ ఎంగేజ్‌మెంట్, డిసెంగేజ్‌మెంట్ లు కుదురుతాయి.