ఎమోషనల్ అయిన అమితాబ్: 25 శాతం లివర్‌తో బతుకుతున్నా

ఎమోషనల్ అయిన అమితాబ్: 25 శాతం లివర్‌తో బతుకుతున్నా

లక్షల్లో అభిమానులను సంపాదించుకుని.. బాలీవుడ్‌లో శిఖరంలా నిలిచిన బిగ్ బీ కెరీర్లో ఫ్యామస్ డైలాగ్‌లు ఎన్నో. వాటిలో ఒకటి ‘దారు సే లివర్ ఖరాబ్ హో జాతా హై’. కానీ, అమితాబ్ బచ్చన్ నిజ జీవితంలో ఎటువంటి ఆల్కహాల్ లేకుండానే లివర్ ప్రాబ్లం వచ్చింది. దాదాపు 75శాతం లివర్ చెడిపోయినా 25శాతంతో కాలం గడుపుతున్నానంటూ అమితాబ్ బచ్చన్ స్వయంగా వెల్లడించారు. 

జాతీయ మీడియా నిర్వహించిన హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమంలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. గతంలో క్షయ, హైపటైటిస్ బీ వంటి వ్యాధులతో పోరాడిన సంగతి గుర్తు చేశారు. అంతేకాదు తనకు క్షయవ్యాధి ఉందనే విషయాన్ని 8 ఏళ్లు ఆలస్యంగా గుర్తించానని చెప్పారు. త్వరగా వ్యాధిని కనుక్కోలేకపోతే దానికి చికిత్స కూడా చేయించుకోలేమని వెల్లడించాడు. 

‘నాకు క్షయ, హైపటిటైటిస్ బీ వ్యాధులు ఉండేవి. ఆ సంగతి నాకు 8 ఏళ్లు ఆలస్యంగా తెలిసింది. ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్లనే వ్యాధి ఉందనే సంగతి తెలియలేదు. 20ఏళ్ల ముందే 75శాతం లివర్‌ దెబ్బతింది. మిగిలిన 25శాతం లివర్‌తోనే బతికేస్తున్నా. ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోతే ఏం వ్యాధి ఉందో తెలియదు’ అని అమితాబ్ బచ్చన్ లేఖ ద్వారా తెలిపారు.