DRDO: భారత రక్షణ వ్యవస్థలో మరో ముందడుగు.. బాలిస్టిక్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ ప్రయోగం విజయవంతం

శత్రు దేశాల క్షిపణుల్ని చీల్చీచెండాడే సరికొత్త రక్షణ మిస్సైల్స్‌ను భారత రక్షణ శాఖ బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. బుధవారం జరిపిన ‘ఏడీ-1 ఇంటర్‌సెప్టార్ మిస్సైల్’ పరీక్ష విజయవంతమైంది.

DRDO: భారత రక్షణ వ్యవస్థలో మరో ముందడుగు.. బాలిస్టిక్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ ప్రయోగం విజయవంతం

DRDO: భారత రక్షణ వ్యవస్థలో మరో కీలక ముందడుగు పడింది. శత్రుదేశాల క్షిపణుల్ని అడ్డుకునే ‘ఏడీ-1 ఇంటర్‌సెప్టార్ మిస్సైల్’ పరీక్ష విజయవంతమైంది. బుధవారం నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైనట్లు భారత రక్షణ, పరిశోధనా సంస్థ (డీఆర్‌డీవో) గురువారం ప్రకటించింది.

Bridegroom: అత్తింటివారు ఇచ్చిన కారుతో అత్తను ఢీకొట్టి చంపిన అల్లుడు

ఈ అంశానికి సంబంధించిన వివరాల్ని డీఆర్‌డీవో చీఫ్ డా.సమీర్ కామత్ వెల్లడించారు. ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ఐలాండ్ తీరంలో ప్రయోగించారు. తాజా క్షిపణులు.. మన దేశంపైకి శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణుల్ని అడ్డుకోగలవు. ఇవి లాంగ్ రేంజ్ క్షిపణుల్ని అడ్డుకుంటాయి. నిర్దేశిత లక్ష్యాన్ని 5,000 కిలోమీటర్ల రేంజులో సాధించగలవు. శత్రుదేశాల క్షిపణుల్ని అడ్డుకునే రక్షణ క్షిపణుల్లో ‘ఏడీ-1 క్షిపణులు’ మరింత శక్తివంతమైనవి. మన గగనతలంలోకి దూసుకొస్తున్న శత్రు క్షిపణిని దేశీయ రాడార్లు గుర్తించి, వాటిని లక్ష్యంగా చేసుకుంటే మన రక్షణ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది.

Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ రద్దు చేస్తూ నిర్ణయం

వెంటనే ‘ఏడీ-1 క్షిపణులు’ దూసుకెళ్లి, వాటిని అడ్డుకుంటాయి. గాలిలోనే తునాతునకలు చేసేస్తాయి. ఇవి దాదాపు 99.8 శాతం సక్సెస్ రేటు కలిగి ఉంటాయి. ఇవి క్షిపణులపైనే కాకుండా, శత్రుదేశాల విమానాలు, హెలికాప్టర్లను కూడా లక్ష్యంగా చేసుకోగలవు. ఇవి పూర్తిగా ఆధునిక సాంకేతికతతో దేశీయంగా తయారయ్యాయి.