Covid booster : కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌.. డీసీజీఐ అనుమతి..

ప్రముఖ ఫార్మాసూటికల్స్‌ సంస్థ బయోలాజికల్‌-ఈ అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘Corbevax‌’ బూస్టర్‌ డోస్‌గా రానుంది. ఈ కార్బెవాక్స్ బూస్టర్ డోసుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది.

Covid booster : కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌.. డీసీజీఐ అనుమతి..

India Clears Corbevax As Covid Booster Shot, Can Be Clubbed With Other

Covid booster : ప్రముఖ ఫార్మాసూటికల్స్‌ సంస్థ బయోలాజికల్‌-ఈ అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘Corbevax‌’ బూస్టర్‌ డోస్‌గా రానుంది. ఈ కార్బెవాక్స్ బూస్టర్ డోసుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. ప్రధానంగా 18ఏళ్లు దాటిన వారందరికీ టీకాను వేసేందుకు అనుమతినిచ్చింది. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారికి కార్బెవాక్స్‌ టీకాను బూస్టర్‌ డోస్‌గా వేసుకోవచ్చునని తెలిపింది. కార్బెవాక్స్ హెటెరోలాజస్ బూస్టర్‌గా ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్‌ కూడా ఇదే. కొవిడ్‌ రెండో డోస్‌ తీసుకున్న 6 నెలల తర్వాత బయోలాజికల్‌-ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నారు. ఈ టీకాను బూస్టర్‌ డోస్‌గా వేసేందుకు డీసీజీఐ ఆమోదం పొందడంపై కంపెనీ ఎండీ మహిమా దాట్ల ఆనందం వ్యక్తం చేశారు.

కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా బూస్టర్‌ డోస్‌ల అవసరాన్ని తగ్గించగల సామర్థం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో తాము ముందడుగు పడిందని అన్నారు. బయోలాజికల్‌-ఈ ఒక్కో డోస్‌ టీకా ధర రూ.250కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని ట్యాక్సులతో కలిపి ఒక్కో బూస్టర్ డోసును వ్యాక్సిన్ కేంద్రాల్లో రూ.400కు అందించనుంది. ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లలో అయితే ట్యాక్సులు, అడ్మినిస్ట్రేషన్‌ చార్జీలతో కలిపి ఒక్కో డోసుకు రూ.990 వరకు ఖర్చు అవుతుంది.

India Clears Corbevax As Covid Booster Shot, Can Be Clubbed With Other Jabs

India Clears Corbevax As Covid Booster Shot, Can Be Clubbed With Other Jabs

2022 ఏప్రిల్‌లో డీసీజీఐ కార్బెవాక్స్‌ 5ఏళ్ల నుంచి 12ఏళ్లు, 6ఏళ్ల నుంచి 12ఏళ్ల పిల్లలకు టీకా వేసేందుకు అత్యవసర అనుమతిని పొందింది. క్లినికల్ ట్రయల్ డేటాలో Corbevax బూస్టర్ మోతాదు రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపర్చిందని, సురక్షితంగా ఉందని రుజువైంది. 18ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న 416 సబ్జెక్టుల్లో కంపెనీ ఈ ట్రయల్‌ని నిర్వహించింది.

ఎలా బుక్ చేసుకోవాలంటే :
Corbevaxతో టీకాలు వేసేందుకు స్లాట్‌ను CoWIN పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు.. భారతదేశంలో 51.7 మిలియన్ డోస్‌ల కార్బెవాక్స్ పిల్లలకు అందించింది. వీరిలో 17.4 మిలియన్లు రెండు డోస్‌లను పొందారని బయోలాజికల్ ఇ లిమిటెడ్ తెలిపింది. ఏప్రిల్‌లో, 5 నుంచి 12 ఏళ్ల వయస్సు గల పిల్లలకు బయోలాజికల్ ఇ కోవిడ్-19 వ్యాక్సిన్ కార్బెవాక్స్ కోసం అత్యవసర వినియోగ అధికారాన్ని మంజూరు చేయాలని DCGI సిఫార్సు చేసింది. కంపెనీ 100 మిలియన్ డోస్‌ల వ్యాక్సిన్‌ను కేంద్రానికి సరఫరా చేసింది.

Read Also : Covid Booster Dose : బూస్టర్ డోసుపై నిపుణుల బృందం చర్చ.. ఏ రకం టీకా.. ఎప్పుడు ఇవ్వాలంటే?