భారత్‌లో ప్రపంచ అతిపెద్ద వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ : ఫస్ట్ డోస్ టీకా ముందుగా ఎవరెవరికి వేస్తారంటే?

భారత్‌లో ప్రపంచ అతిపెద్ద వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ : ఫస్ట్ డోస్ టీకా ముందుగా ఎవరెవరికి వేస్తారంటే?

India Starts ‘world’s largest’ vaccination campaign : భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా (జనవరి 16 నుంచి) శనివారం ఉదయం 10 గంటలకు వర్చువల్‌ విధానంలో మోడీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. తొలి దశలో భాగంగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు దేశవ్యాప్తంగా 3 వేల 6 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి టీకాలు ఇవ్వనున్నారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కార్యకర్తలు, ఐసీడీఎస్‌ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హెల్త్‌కేర్ వర్కర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చైనా తరువాత ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. హెర్డ్ ఇమ్యూనిటీని చేరుకునే దిశగా 1.35 బిలియన్ల మందికి టీకాలు వేయాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. అమెరికా వంటి దేశాలు ప్రతి ఒక్కరికి టీకాలు వేసినప్పటికీ, జనాభాలో సగం మందికి ముందుగా టీకాలు వేయాలని నిర్ణయించాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ / ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్, భారత్ బయోటెక్ నుంచి ప్రభుత్వ అనుమతితో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నాయి. ఈ రెండూ వ్యాక్సిన్లు స్థానికంగా ఉత్పత్తి అవుతున్నాయి.

యునైటెడ్ స్టేట్స్ తరువాత అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు భారతదేశంలోనే నమోదయ్యాయి. ఏడాదిలో మొదటి ఆరు నుండి ఎనిమిది నెలల్లో సుమారు 300 మిలియన్ల మందికి రెండు మోతాదులతో టీకాలు వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో సుమారు 10.5 మిలియన్ల మంది ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు. వీరిలో 151,000 మందికి పైగా మరణించారు. అయినప్పటికీ సెప్టెంబరు మధ్యకాలం నుండి కేసుల రేటు తగ్గింది. వ్యాక్సిన్‌ను మొదట పొందాలంటే 30 మిలియన్ల మంది హెల్త్, ఫ్రంట్‌లైన్ కార్మికులు, పారిశుధ్యం సెక్యూరీటీ సంబంధిత రంగాల వారికి టీకా అందించనున్నారు.

ఆ తరువాత 50 కంటే ఎక్కువ వయస్సు ఉన్న 270 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించే అవకాశం ఉంది. రాజకీయ నేతలను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పరిగణించబోమని మోడీ స్పష్టం చేశారు. టీకా స్టోరేజీ, స్టోరేజీ ఉష్ణోగ్రత, వ్యాక్సిన్ తీసుకునేవారిని ట్రాక్ చేసే సమాచారాన్ని అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ కో-విన్‌ను శనివారం మోడీ అధికారికంగా ప్రారంభించనున్నారు.

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్మించిన ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ షాట్ 11 మిలియన్ మోతాదులను, భారత్ బయోటెక్ కోవాక్సిన్ 5.5 మిలియన్లను ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు చేసింది. కోవిషెల్డ్ 72శాతం ప్రభావవంతంగా ఉందని భారత డ్రగ్ రెగ్యులేటరీ ఆమోదం తెలిపింది. ఇక కోవాగ్జిన్ ఫైనల్ ట్రయల్ ఫలితాలు మార్చి నాటికి వచ్చే అవకాశం ఉందని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో పేర్కొంది.