India To Ban Chinese Phones : చైనాకు భారత్ మరో షాక్.. రూ.12వేల లోపు స్మార్ట్‌ ఫోన్‌ల విక్రయాలపై బ్యాన్‌!

అవకాశం దొరికిన ప్రతీసారి చైనాకు షాక్ ఇస్తూనే ఉంది భారత్‌. గాల్వన్ లోయ ఘటన తర్వాత.. 3వందలకు పైగా చైనా యాప్‌లపై బ్యాన్ విధించింది కేంద్రం. ఈఎఫెక్ట్‌తో లబోదిబో అంటున్న చైనాకు.. ఇప్పుడు మరో కోలుకోలేని ఝలక్ ఇచ్చేందుకు సిద్ధం అయింది. 12 వేల రూపాయల ధరలోపు విభాగంలో ఫోన్లను విక్రయించకుండా చైనా కంపెనీలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

India To Ban Chinese Phones : చైనాకు భారత్ మరో షాక్.. రూ.12వేల లోపు స్మార్ట్‌ ఫోన్‌ల విక్రయాలపై బ్యాన్‌!

India to ban all Chinese phones under Rs 12,000

India To Ban Chinese Phones : ప్రతీ ముగ్గురిలో ఇద్దరి ఫోన్‌లు చూడండి.. కచ్చితంగా చైనా కంపెనీ మొబైల్సే అయి ఉంటాయ్. మాంచి ఫీచర్స్‌తో బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కావాలి అంటే.. గొంతులోంచి ముందుగా వచ్చే పేరు చైనా కంపెనీదే ! ఇండియన్ మార్కెట్‌లో ఆ స్థాయికి వెళ్లిపోయాయ్ ఆ ఫోన్లు. దీంతో దేశీయ కంపెనీలు దుకాణం మూసేసుకోవాల్సిన పరిస్థితి. ఐతే యాప్‌ బ్యాన్‌తో ఇప్పటికే చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్‌.. మొబైల్‌ విక్రయాల్లోనూ ఝలక్ ఇచ్చేందుకు సిద్ధం అయింది. ఇంతకీ ఏం చేయబోతోంది.. భారత్‌ నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభావం ఏ కంపెనీల మీద ఉంటుంది..

అవకాశం దొరికిన ప్రతీసారి చైనాకు షాక్ ఇస్తూనే ఉంది భారత్‌. గాల్వన్ లోయ ఘటన తర్వాత.. 3వందలకు పైగా చైనా యాప్‌లపై బ్యాన్ విధించింది కేంద్రం. ఆ ఎఫెక్ట్‌తో లబోదిబో అంటున్న చైనాకు.. ఇప్పుడు మరో కోలుకోలేని ఝలక్ ఇచ్చేందుకు సిద్ధం అయింది. 12 వేల రూపాయల ధరలోపు విభాగంలో ఫోన్లను విక్రయించకుండా చైనా కంపెనీలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. చైనా ఫోన్లు జనాల్లోకి ఎలా వెళ్లాయంటే.. ప్రతీ ఇద్దరిలో ఒకరిది చైనా కంపెనీ మొబైల్ అటుంది. భారత్‌లో అమ్ముడవుతున్న టాప్‌ 5 మొబైల్‌ బ్రాండ్స్‌లో నాలుగు చైనావే. షావోమి, ఒప్పొ, వివో, రియల్‌మి, వన్‌ప్లస్, ఐకూ వంటి బ్రాండ్లకు సంబంధించిన ఫోన్లే కనిపిస్తూ ఉంటాయ్. ఐతే ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో ఈ కంపెనీలన్నింటిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలను 12వేల కన్నా తక్కువ ధర ఉన్న ఫోన్లను దేశీ మార్కెట్‌లో విక్రయించకుండా నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నివేదికలు చెప్తున్నాయ్. ఈ నిర్ణయం వల్ల వన్‌ ప్లస్‌, ఐకూ వంటి ప్రీమియం బ్రాండ్లపై కాకుండా… షావోమి, రియల్‌మి వంటి కంపెనీలపై ఎక్కువ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్‌ కలిగిన భారత్‌లో… లోయర్ సెగ్మెంట్ నుంచి చైనా దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలను బయటకు పంపాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం రియల్‌మి సహా పలు బ్రాండ్ల వల్ల స్థానిక తయారీ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుండడమే.

Also read : China Phones Ban : స్మార్ట్ ఫోన్‌ అంటే చైనావేనా? భారత్ మార్కెట్‌ను డ్రాగన్ కంపెనీలు ఎలా ఆక్రమించాయ్?

మొబైల్‌ ఫోన్స్‌కు సంబంధించి దేశీయంగా ఎక్కువగా అమ్మకాలు జరిగేవి 12వేల లోపు రూపాయలవే ! స్థానికంగా అస్లెంబ్లింగ్‌, తయారీ చేపట్టిన దేశీయ సంస్థలు కూడా ఈ మోడళ్లే ఎక్కువగా రూపొదిస్తుంటాయ్. షియామీ, వివో, ఓపో, రియల్‌మీలాంటి చైనా సంస్థల దూకుడుతో… దేశీయ సంస్థలైన మైక్రోమ్యాక్స్‌, లావా, కార్బన్‌, సెల్‌కాన్‌ లాంటివి సైడ్‌ అయిపోయాయి. విడిభాగాలు సహా, ఫోన్ల తయారీకి భారీ ప్లాంట్లు కలిగిన చైనా సంస్థలకు పోటీ ఇవ్వలేక… పలు దేశీయ సంస్థలు కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయ్. ఒకరకంగా చెప్పాలంటే.. చైనా కంపెనీలు.. దేశీయ సంస్థలను అణగదొక్కుతున్నాయన్న ఆందోళనలు కనిపిస్తున్నాయ్.

చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలే ఇండియన్ మార్కెట్‌పై గట్టి పట్టు సాధించాయ్. 2022 జూన్ త్రైమాసికపు ఫోన్ల అమ్మకాల లెక్కల ప్రకారం.. 12వేల రూపాయల లోపు ఫోన్ల విక్రయాల్లో చైనా కంపెనీలే ఏకంగా 80 శాతం వాటాను ఆక్రమించాయ్. ఇక అటు మార్కెట్ వాటాపరంగా చూసినా టాప్‌ 5 కంపెనీల్లో శాంగ్‌సంగ్‌ మినహా.. మిగతా నాలుగు చైనావే ! కనీసం టాప్‌-10లో కూడా ఒక్క దేశీయ బ్రాండ్‌ లేదు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ సేల్స్‌లోనూ చైనా కంపెనీలో టాప్‌ రేపుతున్నాయి. డీలర్లకు 30 నుంచి 40 శాతం దాకా కమిషన్స్ ఇస్తుండడంతో పోర్టళ్లు, దుకాణాలు చైనా బ్రాండ్స్‌నే అమ్ముతున్నాయి. 10 నుంచి 12 శాతం కమిషన్ ఇచ్చే ఇండియన్‌ కంపెనీలను పక్కన పెడుతున్నాయి. పైగా చిన్నపాటి మార్పులతో నెలకో కొత్త మోడల్‌ను రిలీజ్ చేస్తుండడమూ చైనా కంపెనీలకు ప్లస్‌గా మారింది.

మొబైల్స్‌ రంగంలో దేశీయ కంపెనీలకు ఎదురవుతున్న అవరోధాలను క్లియర్ చేసేందుకు కేంద్రం సిద్ధం అయింది. ఇప్పుడు బయటకు వచ్చిన నివేదికలు చెప్తోంది కూడా అదే ! దేశీయ మొబైల్‌ బ్రాండ్లకు మార్కెట్‌ అవకాశాలు పెంచడం కోసమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఐతే ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన మాత్రమే.. ప్రధాని నేతృత్వంలోని కేంద్రం దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక విధానం తీసుకొస్తుందా.. అనధికారికంగా అమలు చేస్తుందా అనే విషయాలపై త్వరలో క్లారిటీ రాబోతోంది. ఇది అమల్లోకి వస్తే మాత్రం చైనాకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్ అయ్యే రేంజ్ షాక్ తగలడం ఖాయం. ఇండియన్‌ మొబైల్ మేకర్స్‌కు ఊపిరి లభిస్తుంది.