China Phones Ban : స్మార్ట్ ఫోన్‌ అంటే చైనావేనా? భారత్ మార్కెట్‌ను డ్రాగన్ కంపెనీలు ఎలా ఆక్రమించాయ్?

చైనా కంపెనీల తీరుపై కేంద్రం సీరియస్‌గా ఉంది. పన్ను ఎగవేతకు పాల్పడిన ఘటనలతో.. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు భారత్ సిద్ధమైంది. మరి ఇప్పుడు 12వేల రూపాయల లోపు స్మార్ట్ ఫోన్‌పై బ్యాన్ విధించడం కూడా అందులో భాగమేనా.. అసలు చైనా కంపెనీలతో పోలిస్తే.. దేశీయ సంస్థలు ఎందుకు వెనకే ఉండిపోతున్నాయ్ ? తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కావాలంటే చైనా వైపే చూడాలా?

China Phones Ban : స్మార్ట్ ఫోన్‌ అంటే చైనావేనా? భారత్ మార్కెట్‌ను డ్రాగన్ కంపెనీలు ఎలా ఆక్రమించాయ్?

CHINA PHONE BAN

CHINA PHONE BAN : చైనా కంపెనీల తీరుపై కేంద్రం చాలా సీరియస్‌గా కనిపిస్తోంది. పన్ను ఎగవేతకు పాల్పడిన ఘటనలతో.. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. మరి ఇప్పుడు 12వేల రూపాయల లోపు స్మార్ట్ ఫోన్‌పై బ్యాన్ విధించడం కూడా అందులో భాగమేనా.. అసలు చైనా కంపెనీలతో పోలిస్తే.. దేశీయ సంస్థలు ఎందుకు వెనకే ఉండిపోతున్నాయ్ ?

స్మార్ట్ ఫోన్‌ కావాలంటే.. మన దగ్గర ఇప్పుడు అందరూ చూసేది చైనా కంపెనీల వైపే ! తక్కువ ధరలో అన్నిరకాల ఫీచర్లు చైనా కంపెనీ ఫోన్లలో కనిపిస్తుంటాయ్. చైనా సంస్థలు కూడా ఇండియాలోనే అసెంబ్లీ యూనిట్లు ఏర్పాటు చేసుకుని లక్షల సంఖ్యలో ఫోన్లు ఉత్పత్తి చేస్తున్నాయ్. చైనా కంపెనీలు పాటిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటెజీతో పాటు.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించడంలాంటి విషయాలను దేశీయ బ్రాండ్లు అందుకోలేక పోతున్నాయ్. ఒక మోడల్ మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన రెండు నెలలకు.. చిన్న చిన్న మార్పులతో ఇంకో మోడల్. ఇలా తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్స్‌తో చైనా కంపెనీలు సెల్‌ఫోన్‌లు తీసుకువస్తున్నాయ్. ఐతే ఈ స్ట్రాటజీని అందుకోవడంలో దేశీయ సంస్థలు వెనకే ఉండిపోతున్నాయ్. దీంతో దాదాపు కనుమరుగు అవుతున్న పరిస్థితి.

Also read : India To Ban Chinese Phones : చైనాకు భారత్ మరో షాక్.. రూ.12వేల లోపు స్మార్ట్‌ ఫోన్‌ల విక్రయాలపై బ్యాన్‌!

దేశీయ సంస్థలు కనుమరుగు అవుతున్న తరుణంలో.. మన కంపెనీలను మనమే కాపాడుకోవాలన్న నినాదంతో.. చైనా మొబైల్‌ కంపెనీల విక్రయాలపై నిషేధం విధించాలని కేంద్రం ఆలోచన చేస్తుందన్న చర్చ జరుగుతోంది. దీనికితోడు చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు… భారత్‌కు భారీ మొత్తంలో ట్యాక్స్‌కు ఎగవేస్తున్నాయ్. ఈ అంశంపై కూడా కేంద్రం దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన షావోమి, వివో, ఒప్పొ వంటి వాటికి నోటీసులు కూడా పంపింది. ఈ కంపెనీలకు మనదేశంలో అమ్మకాలు భారీగా ఉన్నాయ్. అయితే పన్ను చెల్లింపులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయ్. ఇలాంటి అన్ని సమస్యలకు చెక్‌ పెట్టాలంటే.. చైనా కంపెనీల కుంభస్థలం మీద కొట్టాలని కేంద్రం భావిస్తోంది.

వివో సంస్థ మోసాలను ఈడీ.. ఈ మధ్యే బయటపెట్టింది. కంపెనీకి చెందిన టర్నోవర్‌లో దాదాపు 50శాతం నిధులను చైనాకు తరలించింది. దీంతో మన దగ్గర పన్నుఎగవేతకు పాల్పడిందని ఈడీ తేల్చింది. భారత్‌లో పన్ను ఎగవేసేందుకు మొత్తం 62వేల 476 కోట్ల మేర నిధులను వివో సంస్థ చైనాకు పంపించింది. ఇక్కడ నష్టాలు వచ్చినట్లు చూపించి పన్ను ఎగవేతకు పాల్పడింది. వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఒప్పో కూడా పన్నులు ఎగ్గొట్టినట్లు బయటపడింది. ఈ రెండూ చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీలే కాగా.. ఒకే మాతృ సంస్థ కావడం హైలైట్. ఒప్పో సంస్థ 4వేల 389 కోట్ల వరకు కస్టమ్‌ డ్యూటీ ఎగవేసింది. కొన్ని వస్తువుల విలువను తక్కవ చేసి చూపించడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడింది. మరో కంపెనీ షావోమి కూడా 653 కోట్లు ఎగవేతకు పాల్పడింది. ఈ మూడు సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.

మన దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులను చైనా వాడేసుకుంటోంది. లాక్‌డౌన్‌ లాంటి సమయంలోనూ చైనా హాయిగా ఉందంటే.. ఒకరకంగా మన మనీతోనే ! ఐతే చైనా సంస్థల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించిన ప్రతీసారి.. వాళ్లు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. దీంతో కేంద్రం ఓ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అయింది. అందులో భాగంగా ఇప్పుడు 12వేల రూపాయల లోపు ఫోన్ల విక్రయాల్లో చైనా సంస్థలపై నిషేధం విధించాలని ఫిక్స్ అయింది. కేంద్రం ఈ నిర్ణయం అమల్లోకి తీసుకువస్తే.. వివో, ఒప్పోకు మించి షావోమీ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. మన మార్కెట్‌లో వేళ్లూనుకుపోయిన షావోమీకి.. కూసాలు కదలడం ఖాయం.