Air bags : కారు ఉందా.. డిసెంబర్ లోగా రెండు సీట్లకు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి

కారు ఉందా అయితే..మీరు తప్పకుండా ఎయిర్ బ్యాగ్ తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. ఇప్పటి వరకు డ్రైవర్ సీటుకు మాత్రమే ఏర్పాటు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డ్రైవర్ పక్కనే ఉన్న మరో సీటుకు కూడా ఎయిర్ బ్యాగ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని రహదారి రవాణా శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Air bags : కారు ఉందా.. డిసెంబర్ లోగా రెండు సీట్లకు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి

Airbag

Front Seat Airbags : కారు ఉందా అయితే..మీరు తప్పకుండా ఎయిర్ బ్యాగ్ తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. ఇప్పటి వరకు డ్రైవర్ సీటుకు మాత్రమే ఏర్పాటు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డ్రైవర్ పక్కనే ఉన్న మరో సీటుకు కూడా ఎయిర్ బ్యాగ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని రహదారి రవాణా శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిని నాలుగు నెలల పాటు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా కార్ల మోడళ్లలో ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి చేయడాన్ని 2021, డిసెంబర్ 31 వరకు వాయిదా వేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని సమాచారం. The Society of Indian Automobile Manufacturers (SIAM) తయారీ దారులు సమయం కోరినట్లు తెలుస్తోంది. కొత్త మోడళ్లకు మాత్రం ఇది తప్పనిసరి అని అధికారులు వెల్లడిస్తున్నారు.

2021 ఏప్రిల్ 01 తర్వాత తయారు చేసిన వాహనాలు కొత్త మోడళ్లు, 2021, ఆగస్టు 31 ప్రస్తుత మోడళ్ల విషయంలో ఫ్రంట్ సీట్ ఎయిర్ బ్యాగ్ అమర్చాల్సి ఉంటుంది. ప్రయాణీకుల భద్రత విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనాల్లో డ్రైవర్ సీటులో ఎయిర్‌ బ్యాగ్‌ను కేంద్రం ఇప్పటికే తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. డ్రైవర్ పక్కన కూర్చునే వారికి కూడా ప్రమాదం పొంచి ఉండడంతో ఆ సీటులోనూ ఎయిర్ బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాలం చెళ్లిపోయి రోడ్ల మీద సంచరించే వాహనాల్లో కూడా ఎయిర్ బ్యాగ్ తప్పనసరి కానుంది.