Maharashtra Politics: మహారాష్ట్రలో మళ్లీ మొదలైన రాజకీయ రగడ.. షిండే ప్రభుత్వం ఉండేనా? ఊడేనా?

కోపంతో ఉన్న శిబిరం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి తమ అసంతృప్తిని తెలియజేసినట్లు నేను విన్నాను. మూడు నెలలు మాత్రమే అయ్యాయి. హనీమూన్ కూడా ముగియలేదు. అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. కేవలం మూడు నెలల్లోనే ఇలాంటి వార్తలు వస్తున్నాయి

Maharashtra Politics: మహారాష్ట్రలో మళ్లీ మొదలైన రాజకీయ రగడ.. షిండే ప్రభుత్వం ఉండేనా? ఊడేనా?

Maharashtra Politics: మహారాష్ట్రలో మరోసారి రాజకీయ రగడ మొదలైంది. రాజకీయ ప్రకంపనలకు కారణం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్. ఆయన అసహనం వెలుగులోకి వస్తున్నప్పటికీ, అందుకు గల కారణమేమిటో ఎవరూ బహిరంగంగా చెప్పడం లేదు. అయితే, ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ చేరుకుని హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇక మరొక పక్క ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఉద్ధవ్ ప్రభుత్వంలాగే ఇది కూడా కూలిపోనుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

సుప్రియా సూలే సెటైర్లు
అజిత్ పవార్ అసంతృప్తి వార్తల నేపథ్యంలో ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే విరుచుకుపడ్డారు. మూడు నెలల హనీమూన్ కూడా ముగియలేదని, సమస్యలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. సుప్రియా సూలే మాట్లాడుతూ.. ‘‘ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు మాత్రమే అయింది. ఒక శిబిరం కోపంగా ఉందని నేను విన్నాను. కోపంతో ఉన్న శిబిరం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి తమ అసంతృప్తిని తెలియజేసినట్లు నేను విన్నాను. మూడు నెలలు మాత్రమే అయ్యాయి. హనీమూన్ కూడా ముగియలేదు. అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. కేవలం మూడు నెలల్లోనే ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు?’’ అని అన్నారు.

అనుమానాలకు బలం పెంచిన పవార్ వ్యాఖ్యలు
అజిత్ పవార్ గత కొద్ది రోజులుగా మూడ్ మారినట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్ నెలలోనే ఆయన చేసిన ప్రకటన రాజకీయ వాతావరణంలో సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 23న బారామతిలో మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను ఆర్థిక మంత్రిగా ఎంతకాలం ఉంటానో తనకు కూడా తెలియదని అన్నారు. ‘‘ఈ రోజు నాకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉంది. కాబట్టే పథకాల ప్రయోజనాలను మీకు అందిస్తున్నాను. అయితే ఈ బాధ్యత ఎంతకాలం ఉంటుందో చెప్పలేను’’ అని అజిత్ పవార్ అన్నారు. ఇక గణేష్ చతుర్థి కోసం లాల్‌బాగ్చా గణేష్ మండపానికి అమిత్ షా వెళ్లినప్పుడు అక్కడ అజిత్ పవార్ కనిపించలేదు. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్‌ షిండేలతో అమిత్‌ షా సమావేశమైనా, దానికి కూడా హాజరుకాలేదు.

తెలివిగా పిలిచిన బీజేపీ ఎమ్మెల్యే
కొద్ది రోజుల క్రితం అజిత్ పవార్‌పై బీజేపీ ఎమ్మెల్యే గోప్‌చంద్ పదాల్కర్ చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించింది. మహారాష్ట్రలోని ధంగర్ కమ్యూనిటీ సమస్యపై సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌లకు పదాల్కర్ లేఖ రాశారు. అజిత్ పవార్‌కు ఎందుకు లేఖ రాయలేదని అడిగినప్పుడు, ‘‘అజిత్ పవార్ తెలివైన తోడేలు పిల్ల. అందుకే ఆయనను సంప్రదించాల్సిన అవసరం లేదు’’ అని పదాల్కర్ సమాధానం ఇచ్చారు. ఇలాంటి కారణాల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందోనని అంటున్నారు.