IT raids in Maha: రూటు మార్చిన ఐటీ అధికారులు.. పెళ్లివారమంటూ బడా వ్యాపారి ఇంట్లో రైడ్స్

మహారాష్ట్రలోని జల్నా, ఔరంగాబాద్ నగరాల్లో రియల్ ఎస్టేట్, స్టీల్, వస్త్ర వ్యాపారాలు చేస్తున్న ఓ వ్యాపారికి చెందిన ప్రాపర్టీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. రైడ్లకు వారు వస్తున్నట్లు తెలియకుండా ‘దుల్హన్ హమ్ లే జాయేంగే’ అని స్టిక్కర్లను కార్లపై అంటించి పెళ్లి వారిలా వచ్చారు. ఇలా ఆగస్టు 1 నుంచి 8 తేదీ మధ్య రైడ్లు నిర్వహించగా 390 కోట్ల రూపాయల విలువైన చట్టవిరుద్ధ ఆస్తులు లభించాయి

IT raids in Maha: రూటు మార్చిన ఐటీ అధికారులు.. పెళ్లివారమంటూ బడా వ్యాపారి ఇంట్లో రైడ్స్

IT officials seize 390 crores from Maha businessman in raids

IT raids in Maha: ఐటీ దాడులను ముందే పసిగట్టి అక్రమ ఆర్జన దొరక్కుండా తిమ్మినిబొమ్మిని చేస్తుంటారు కొంతమంది. అలాంటి వారి ఆట కట్టించేందుకు ఐటీ అధికారులు సైతం కొన్నిసార్లు వింత వింత వేషధారణలో వెళ్లి రైడ్లు చేస్తుంటారు. తాజాగా మహారాష్ట్రలో ఒక బడా వ్యాపారి ఇంటిపై జరిగిన దాడి కూడా అలాంటిదే. పెళ్లివారమంటూ చెప్పి ఇంట్లోకి ప్రవేశించి వందల కోట్ల విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

మీడియా కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని జల్నా, ఔరంగాబాద్ నగరాల్లో రియల్ ఎస్టేట్, స్టీల్, వస్త్ర వ్యాపారాలు చేస్తున్న ఓ వ్యాపారికి చెందిన ప్రాపర్టీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. రైడ్లకు వారు వస్తున్నట్లు తెలియకుండా ‘దుల్హన్ హమ్ లే జాయేంగే’ అని స్టిక్కర్లను కార్లపై అంటించి పెళ్లి వారిలా వచ్చారు. ఇలా ఆగస్టు 1 నుంచి 8 తేదీ మధ్య రైడ్లు నిర్వహించగా 390 కోట్ల రూపాయల విలువైన చట్టవిరుద్ధ ఆస్తులు లభించాయి. ఇందులో 58 కోట్ల రూపాయలు, 32 కేజీల బంగారానికి ఎలాంటి లెక్క, పత్రం లేదని అధికారులు ధ్రువీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ శాఖకు చెందిన 260 మంది ఉద్యోగులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.

Adani Enterprises: అల్యూమినియం రంగంపై అదానీ గ్రూప్ గురి..