Adani Enterprises: అల్యూమినియం రంగంపై అదానీ గ్రూప్ గురి..

అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అధినేత, ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించుకుంటున్నాడు.

Adani Enterprises: అల్యూమినియం రంగంపై అదానీ గ్రూప్ గురి..

Adani Group

Adani Enterprises: అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అధినేత, ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించుకుంటున్నాడు. ఒక్కో రంగంలో అడుగుపెడుతూ అన్ని రంగాల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకొనేలా అదానీ గ్రూప్ అడుగులు వేస్తోంది. తాజాగా అదానీ గ్రూప్ అల్యూమినియం రంగంపై దృష్టి కేంద్రీకరించింది. ఒడిశాలో అల్యూమినా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 5.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 41.30 వేల కోట్లు)తో పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.

Gautam Adani: ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో గౌతమ్ అదానీ.. ఏడాదిలో రికార్డు స్థాయిలో సంపద వృద్ధి

ముంద్రా అల్యూమినియం లిమిటెడ్ పేరిట గత డిసెంబర్ లోనే అదానీ గ్రూప్ ఓ అనుబంధ సంస్థను నెలకొల్పిన విషయం విధితమే. ఆదిత్య బిర్లా గ్రూప్, లండన్ కు చెందిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వంటివారు ఆధిపత్యం చెలాయిస్తున్న రంగంలో అదానీ గ్రూప్ ప్రవేశిస్తోంది. ఒడిశా రాష్ట్రంలో శుద్ధికేంద్రం, క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను నిర్మించడానికి అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ ఆమోదం పొందిందని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొంది. ప్రభుత్వం యొక్క మరొక ప్రకటన ప్రకారం.. శుద్ధికేంద్రం వార్షిక సామర్థ్యాన్ని నాలుగు మిలియన్ టన్నులు కలిగి ఉంటుంది. ఒడిశాలో ప్రాజెక్ట్, అభివృద్ధి చెందుతున్న అల్యూమినియం వ్యాపారం కోసం కంపెనీ యొక్క ప్రణాళికలపై మాట్లాడటానికి అదానీ ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధి నిరాకరించారు.

Gautam Adani: టెలికాం రంగంలోకి ప్ర‌వేశించ‌డానికి అదానీ సిద్ధం!

అదానీ గ్రూప్ అన్ని రంగాల్లో వేగంగా అడుగులు వేస్తోంది. తొలుత వ్యవసాయోత్పత్తుల వ్యాపారంలో ఉన్న అదానీ క్రమంగా నౌకాశ్రయాల రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత వరుసగా విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో వేగంగా అడుగులు వేశారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న హోల్సిమ్ లిమిటెడ్ కు చెందిన భారత విభాగాన్ని సొంతం చేసుకోవటం ద్వారా రాత్రికి రాత్రే అదానీ గ్రూప్ సిమెంట్ తయారీ రంగంలోకి ప్రవేశించింది. ఇదే వరుసలో లోహ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతోంది.