Mangoes: డజను మామిడి పండ్లను లక్షా 20వేలకు కొన్న వ్యాపారవేత్త.. మంచిపని కోసమే!

కరోనా కష్టకాలంలో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడిపోయాయి. పేదరికంతో పోరాడుతూ ఎంతోమంది చిన్నారులు వారి చదువులకు దూరం అయ్యారు.

Mangoes: డజను మామిడి పండ్లను లక్షా 20వేలకు కొన్న వ్యాపారవేత్త.. మంచిపని కోసమే!

Mangoes

Dozen Mangoes for Rs 1.2 Lakh: కరోనా కష్టకాలంలో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడిపోయాయి. పేదరికంతో పోరాడుతూ ఎంతోమంది చిన్నారులు వారి చదువులకు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఓ బాలికకు ఆన్‌లైన్‌లో చదువుకోవాలన్న పన్నెండు మామిడి పండ్లు అమ్మడం ద్వారా తీరింది. జంషెడ్పూర్‌కు చెందిన తులసి కుమారి అనే పదకొండేళ్ల బాలిక ఆన్‌లైన్‌లో క్లాసులు వినేందుకు ఫోన్ లేక స్మార్ట్ ఫోన్ కొనుక్కునే స్థోమత లేక రోడ్డుపై మామిడి పండ్లు అమ్ముకుంటూ జీవిస్తోంది.

ఆన్‌లైన్ తరగతుల్లో చదువుకునేందుకు ఆండ్రాయిడ్ ఫోన్ అవసరం ఉండగా.. ఆమె కోర్కెను తీర్చేందుకు ఆమె అమ్ముతున్న మామిడిపండ్లను ఒక్కక్కొటి రూ. 10వేలు లెక్కన.. 12మామిడి పండ్లను లక్షా 20వేలకు కొనుగోలు చేశాడు ముంబైకి చెందిన అమెయా హేతే అనే వ్యాపారవేత్త. ఎడ్యుటైనర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అమేయా హేతే, పండ్లు అమ్ముతున్న బాలికతో మాట్లాడుతున్న సమయంలో అమెకు చదువు పట్ల ఉన్న అభిరుచిని గమనించి సాయం చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.

ఆమె తండ్రి నరేంద్ర హేతే దగ్గర రూ.120రూపాయలు విలువ చేసే మామిడి పండ్లను.. లక్షా 20వేల రూపాయలు పెట్టి కొన్నాడు. తులసికి మొబైల్ ఫోన్ మాత్రమే కాదు.. రెండేళ్ల ఇంటర్నెట్ కూడా ఉచితం అందించాలని తండ్రికి సూచించారు. తద్వారా ఆమె తన ఆన్‌లైన్ క్లాస్‌లు మిస్ అవ్వదని, అవసరమైనప్పుడు ఇంకా తనకు పండ్లు అమ్మాలంటూ చెప్పేసి వెళ్లిపోయాడు.

తన కూతురుకు సాయం చేసేందుకు అమేయా హేతే భగవాన్ రూపంలో వచ్చారంటూ నరేంద్ర హేతే సంతోషం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన నరేంద్రకు తులసి తల్లి పద్మిని దేవి కూడా కృతజ్ఞతలు తెలిపారు.