Malaria Cure: పిల్లలలో మలేరియా చికిత్స కోసం ‘చక్కర బిళ్లల’ను అభివృద్ధి చేసిన జేఎన్‌యూ పరిశోధకులు

భారత్ లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) పరిశోధకుల బృందం చిన్నారుల్లో మలేరియా చికిత్సకు ఒక ప్రత్యేకమైన ఔషధాన్ని అభివృద్ధి చేసింది.

Malaria Cure: పిల్లలలో మలేరియా చికిత్స కోసం ‘చక్కర బిళ్లల’ను అభివృద్ధి చేసిన జేఎన్‌యూ పరిశోధకులు

Malaria

Malaria Cure: తీవ్రమైన వ్యాధిగా పరిగణిస్తున్న మలేరియా నివారణ, చికిత్సకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారిన మలేరియాకు.. ప్రభావవంతమైన మందులు మరియు చికిత్సను అభివృద్ధి చేయడానికి పరిశోధకులు కృషి కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో భారత్ లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) పరిశోధకుల బృందం చిన్నారుల్లో మలేరియా చికిత్సకు ఒక ప్రత్యేకమైన ఔషధాన్ని అభివృద్ధి చేసింది. చక్కెర ఆధారిత బిళ్లలు..చిన్నారుల్లో మలేరియా చికిత్సకు ఉపయోగించవచ్చని పరిశోధకులు గుర్తించారు. చక్కెరలో సహజంగా ఉండే ఆల్కహాల్ మలేరియాకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనలో తేలింది.

Other Stories:Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి కారణం కరోనా వ్యాక్సినేనా? కుట్ర కోణం ఉందన్న కుట్ర సిద్ధాంతకర్తలు

తీపి కోసం సాధారణంగా వినియోగించే ఎరిథ్రిటాల్‌(Erythritol) అని పిలువబడే ఈ రకమైన పదార్ధాన్ని శక్తివంతమైన యాంటీమలేరియల్‌గా పనిచేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఐదేళ్ల లోపు చిన్నారుల్లోనూ ఇది ఎంతో సమర్ధంగా పనిచేస్తున్నట్టు జేఎన్‌యూ ప్రొఫెసర్ శైలజా సింగ్ తెలిపారు. ఎరిథ్రిటాల్‌(Erythritol) చక్కెర ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ఒక సేంద్రీయ సమ్మేళనం. “పిల్లల్లో చక్కెర బిళ్లలతోనే మలేరియాను నయం చేయగలిగినప్పుడు..ఇక వేరే చికిత్సలు ఎందుకు? అదే మేము ఇక్కడ చేయాలనుకుంటున్నాము” అని ప్రొఫెసర్ శైలజా సింగ్ తన కొత్త పరిశోధనల గురించి చెప్పారు.

Other Stories:Assam Floods: అస్సాంలో తెగిపడిన రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.180 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

BioXRivలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, మలేరియా పరాన్నజీవి ఆక్వాపోరిన్ ఛానల్‌ను ఎరిథ్రిటాల్ బందించి మలేరియా పరాన్నజీవి పెరుగుదలను నిరోధిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏయేటికాయేడు..మలేరియా కేసులు పెరుగుతూన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2019లో 227 మిలియన్ మంది మలేరియా భారిన పడగా..2020లో ఆసంఖ్య 241 మిలియన్ కు చేరింది. రానున్న రోజుల్లో ప్రపంచ జనాభాలో సగం మంది మలేరియా భారిన పడే అవకాశం ఉన్నట్లు WHO అంచనా వేసింది.