Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి కారణం కరోనా వ్యాక్సినేనా? కుట్ర కోణం ఉందన్న కుట్ర సిద్ధాంతకర్తలు

కొన్ని సంస్థలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ల కారణంగానే మనుషుల్లో ఈ మంకీపాక్స్ వైరస్ పుట్టుకొస్తుందని వారు వాదిస్తున్నారు.

Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి కారణం కరోనా వ్యాక్సినేనా? కుట్ర కోణం ఉందన్న కుట్ర సిద్ధాంతకర్తలు

Alex

Monkeypox: కరోనా మహమ్మారి వ్యాప్తి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచ జనాభాకు మరో కొత్త వైరస్ కలవరపెడుతుంది. కరోనా పీడ ఇక లేనట్లే అని భావిస్తున్న తరుణంలో..మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిలోకి వచ్చింది. భారత్, యూకే, యూఎస్ సహా..ప్రపంచ వ్యాప్తంగా 23 దేశాల్లో మంకీపాక్స్ వైరస్ బయటపడింది. అయితే కరోనా వైరస్ లా మంకీపాక్స్ వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇదిలాఉంటే..అసలు మంకీపాక్స్ వైరస్ ఉన్నట్టుండి ఒకేసారి వ్యాప్తిలోకి రావడంపై కొందరు కుట్ర సిద్ధాంతకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంస్థలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ల కారణంగానే మనుషుల్లో ఈ మంకీపాక్స్ వైరస్ పుట్టుకొస్తుందని వారు వాదిస్తున్నారు.

Other Stories:Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు కేసులో వాదనలు విన్న సుప్రీం కోర్టు

ఏమిటి వారి వాదన?

కోవిడ్-19 వ్యాక్సిన్‌లలో మంకీపాక్స్ వ్యాప్తికి కారణమయ్యే చింపాంజీ వైరస్ ఉంటుందనేది కుట్ర సిద్ధాంతకర్తల వాదన. అందుకు కారణం లేకపోలేదు. ఇంగ్లాండ్ లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (భారత్ లో కోవీషీల్డ్)లో చింపాంజీలలో ఉండే “అడెనోవైరస్ వ్యాక్సిన్ వెక్టర్‌” ఉందనే వాస్తవం ఆధారంగా ఈ సిద్ధాంతం తెరపైకి వచ్చింది. అయితే నిజానికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ లో “అడెనోవైరస్ వ్యాక్సిన్ వెక్టర్‌” ఉన్నప్పటికీ దాని వెనుక సైన్స్ ధ్రువీకరణ ఉంది. అయితే కోవిడ్ టీకాపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకే కొందరు ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది.

Other Stories:WARTS : పులిపిర్లు ఎందుకొస్తాయ్! నివారణ ఎలాగంటే?

కుట్ర దారులు అసత్య ప్రచారం:

కరోనా టీకాపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు కొందరు వ్యక్తులు పనిగట్టుకుని ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అమెరికాకు చెందిన InfoWars అనే వెబ్ సైట్ నిర్వాహకుడు అలెక్స్ జోన్స్..ఇటువంటి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయడంలో దిట్ట. అతను USలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ, పనికిమాలిన విషయాలన్నింటిని తెరపైకి తెస్తుంటాడు. ఈక్రమంలోనే కోవిడ్ టీకాకు – మంకీపాక్స్ వైరస్ వ్యాప్తికి ముడిపెట్టాడు అలెక్స్ జోన్స్. ఆస్ట్రాజెనెకా మరియు జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌లు తీసుకుంటున్న దేశాలలో ప్రజలు మంకీపాక్స్ వైరస్ భారిన పడుతున్నారని జోన్స్ వదంతులు సృష్టించాడు. “ఆస్ట్రాజెనెకా మరియు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ లో ఉన్నదేమిటంటే చింపాజీల వైరస్ వెక్టర్స్. వాటిని కోవిడ్ – 19 వ్యాక్సిన్లుగా మార్చి మనుషుల కణాలలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు” అని అలెక్స్ జోన్స్ ఆరోపించారు.

Other Stories:Monkeypox : మంకిపాక్స్ డేంజర్ బెల్స్..పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్

వదంతుల్లో నిజమెంత? కోవిడ్ టీకా సురక్షితమేనా?:

కోవిడ్-19 వ్యాక్సిన్‌లు కోతి కణజాలంలో అభివృద్ధి చెందాయని అనేక కుట్ర సిద్ధాంతాలు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నాయి. అసలు కరోనా..మహమ్మారిగా పరిణమించడానికి కారణం బిల్ గేట్స్‌ అంటూ వాదించేవారు ఉన్నారు. వాస్తవానికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను.. చింపాంజీ అడెనోవైరస్ వ్యాక్సిన్ వెక్టర్‌ను ఉపయోగించే అభివృద్ధి చేశారు. అయితే దాని నుంచి సేకరించిన అనంతరం వైరస్ వెక్టార్ ను మనుషుల్లో హానిచేయకుండా, బలహీన పరిచి కణాలను నిర్వీర్యం చేస్తారు. చింపాంజీ అడెనోవైరల్ వెక్టర్స్ చాలా బాగా అధ్యయనం చేయబడిన వ్యాక్సిన్ రకం. వీటిని ఇప్పటికే వేలాది సబ్జెక్ట్‌లలో సురక్షితంగా పరీక్షించారు. చింపాంజీల నుంచి సేకరించిన అనంతరం అడెనోవైరల్ వెక్టర్స్ జన్యుపరంగా మార్చబడింది. దీంతో ఇది మానవులలో తిరిగి పెరగడం అసాధ్యం అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తెలిపింది. “అవును, వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనది మరియు కరోనావైరస్ కు వ్యతిరేకంగా పోరాటంలో శక్తివంతమైన ఆయుధం” అని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రకటించారు.