Floating Bridge: కర్ణాటకలో ప్రారంభించిన మూడు రోజుల్లోనే ధ్వంసం అయిన ‘తేలియాడే వంతెన’

కర్ణాటక రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రూ.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ తేలియాడే వంతెన పర్యాటకుల కోసం ప్రారంభించిన మూడు రోజుల్లోనే ధ్వంసం అయింది.

Floating Bridge: కర్ణాటకలో ప్రారంభించిన మూడు రోజుల్లోనే ధ్వంసం అయిన ‘తేలియాడే వంతెన’

Floting

Floating Bridge: కర్ణాటక రాష్ట్రం ఉడుపిలోని మాల్పే సముద్ర తీరంలో నిర్మించిన తేలియాడే వంతెన ధ్వంసం అయింది. కర్ణాటక రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రూ.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ తేలియాడే వంతెన పర్యాటకుల కోసం ప్రారంభించిన మూడు రోజుల్లోనే ధ్వంసం అయింది. కరోనా అనంతరం దక్షిణ కర్ణాటకలో పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. ఈక్రమంలో ఉడుపి సముద్ర తీరంలో మాల్పే బీచ్ వద్ద..ఈ తేలియాడే వంతెన నిర్మించారు. బీచ్ నుంచి సముద్రంలోకి 100 మీటర్ల పొడవున నిర్మించిన ఈ వంతెనను మే 6న స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇంతలోనే సముద్రంలో అల్లకల్లోల్లం కారణంగా భారీ అలలు ఎగసిపడి వంతెన ఎక్కడిక్కడే తెగిపోయింది. అలల ఉధృతికి వంతెన మిగతా భాగం కూడా ధ్వంసం కాకుండా..ముందు జాగ్రత్త చర్యగా విడి భాగాలుగా తొలగించారు.

Also read:Madhya Pradesh : పవర్ కట్ తెచ్చిన తంటా..తారుమారైన వధువరులు

అయితే కర్ణాటక రాష్ట్ర పర్యాటకశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ తేలియాడే వంతెన ప్రాజెక్ట్ మూడు రోజుల్లోనే ఇలా నిర్వీర్యం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ధనాన్ని అధికారులు ఇలా వృధా చేస్తున్నారంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన కాంట్రాక్టు దారుడు మీడియాతో మాట్లాడుతూ..మొట్టమొదటిసారిగా చేపట్టిన ఇటువంటి ప్రాజెక్టులో ఎక్కడోచోట లోపాలు జరుగుతుంటాయని..వాటిని సరిచేసుకుని తిరిగి వంతెనను పటిష్టంగా నిర్మించి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామంటూ చెప్పుకొచ్చారు.

Also Read:Bengaluru : చనిపోదామని ఇల్లొదిలిపోయి..మృత్యు ఒడిలో అలా వెళ్లి పడుకున్న 18 ఏళ్ల బాలుడు

మరోవైపు బెంగళూరులో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో పలు చోట్ల భవనాలు, రోడ్లు ధ్వంసం అయ్యాయి. భారీ వర్షాలు బలమైన ఈదురు గాలుల కారణంగా ఇటీవలే ప్రారంభించబడిన అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలోని కొత్తగా నిర్మించిన గ్యాలరీ గోడ కూలిపోయింది. సుమారు రూ.40.25 కోట్లు వెచ్చించి బెంగళూరులోని HSR లేఔట్ లో ప్రభుత్వం ఈ స్టేడియంను నిర్మించింది.