Gilli Danda: ‘ఖోఖో, గిల్లీ దండా’తోపాటు 75 క్రీడలకు స్కూళ్లలో చోటు.. కేంద్రం నిర్ణయం

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 75 క్రీడలకు స్కూళ్లలో చోటు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆడే గిల్లీ దండా, ఖోఖో వంటి వాటికి చోటు దక్కింది. మొత్తం 75 ఆటలు ఇకపై స్కూళ్లలో తప్పనిసరిగా ఆడాల్సి ఉంటుంది.

Gilli Danda: ‘ఖోఖో, గిల్లీ దండా’తోపాటు 75 క్రీడలకు స్కూళ్లలో చోటు.. కేంద్రం నిర్ణయం

Gilli Danda: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని అన్ని స్కూళ్లల్లో 75 క్రీడలకు చోటు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) తీసుకొచ్చి రెండేళ్లైన సందర్భంగా కూడా ఈ నిర్ణయం తీసుకుంది. వీటిలో గ్రామీణ క్రీడలకూ చోటు కల్పించింది.

Fake Traffic Police: అసలు పోలీసులతో కలిసిపోయి చలాన్లు వసూలు చేస్తున్న నకిలీ ట్రాఫిక్ పోలీస్

ఈ 75 క్రీడల్లో ఖోఖో, గిల్లీ దండా, లంగ్డీ, అత్యాపత్యా వంటి సంప్రదాయ ఆటలు కూడా ఉన్నాయి. పాఠశాల స్థాయి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు విద్యాసంస్థల్లో వీటిని ప్రత్యేక ప్రణాళికగా చేరుస్తారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్ఈపీలో భాగంగా ఇప్పటికే స్థానిక భాషలు, సంస్కృతం వంటి వాటిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. అలాగే ఆయుర్వేదం, పారా మెడికల్, వాస్తు శాస్త్ర వంటి వాటిని కూడా ప్రోత్సహించాలనుకుంటోంది. ఢిల్లీలోని సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీతోపాటు, లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల్లో వీటికి సంబంధించిన కోర్సులు ప్రారంభమవుతాయి. ఈ కోర్సులతోపాటు యోగా, ఆయుష్, మ్యూజిక్ వంటి కోర్సులు కూడా ప్రారంభమవుతాయి.

ISRO Satellites: నిరుపయోగంగా శాటిలైట్లు.. ఇస్రో ప్రకటన

త్వరలో నేచురోపతిలో పీజీ డిప్లొమా కోర్సు కూడా ప్రారంభమవుతుంది. దీనికోసం 200 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. మరోవైపు పాఠశాల స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించినట్లు అవుతుందని కేంద్రం చెబుతోంది.