వామ్మో : కిలో టీ పొడి ధర రూ.40వేలు

సాధారణంగా టీ పొడి ధర ఎంతుంటుంది.. అంటే.. మంచి క్వాలిటీది అయితే కిలో రూ.500 లేదా వెయ్యి రూపాయలు ఉండొచ్చు. మరీ స్పెషల్ టీ పొడి అయితే ఓ రూ.5వేల వరకు

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 11:39 AM IST
వామ్మో : కిలో టీ పొడి ధర రూ.40వేలు

సాధారణంగా టీ పొడి ధర ఎంతుంటుంది.. అంటే.. మంచి క్వాలిటీది అయితే కిలో రూ.500 లేదా వెయ్యి రూపాయలు ఉండొచ్చు. మరీ స్పెషల్ టీ పొడి అయితే ఓ రూ.5వేల వరకు

సాధారణంగా టీ పొడి ధర ఎంతుంటుంది.. అంటే.. మంచి క్వాలిటీది అయితే కిలో రూ.500 లేదా వెయ్యి రూపాయలు ఉండొచ్చు. మరీ స్పెషల్ టీ పొడి అయితే ఓ రూ.5వేల వరకు ఉంటుంది. అక్కడికే రేటు ఎక్కువైంది. కానీ.. ఆ టీ పొడి ధర మాత్రం కిలో రూ.40వేలు. నమ్మబుద్ది కావడం లేదా.. కానీ ఇది నిజం.

తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా కున్నూరులో తేయాకు ప్రదర్శన జరిగింది. ఇందులో ‘ఏజ్‌ టి’ టీ పొడి ధర కిలో రూ.40 వేలుగా నిర్ణయించడం సందర్శకులను విస్మయానికి గురిచేసింది. దక్షిణ భారత టీ బోర్డు ఆధ్వర్యంలో కున్నూరు ఉపాసి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తేయాకు ప్రదర్శనలో ఉత్పత్తిదారులు.. గ్రీన్‌ టీ, వైట్‌ టీ, ఎల్లో టీ, ఆర్థోడెక్స్‌ తదితర పలురకాల టీ పొడులు ఉంచారు.

ఈ ప్రదర్శనలో ఆర్గానిక్‌ పద్ధతిలో పండించిన తేయాకుతో తయారు చేసిన టీ పొడులకు భారీ ధర నిర్ణయించారు. ‘భూఏర్’, ఏజ్’ రకం టీ పొడుల ధరలు సందర్శకులకు షాక్ ఇచ్చాయి. ఎందుకంటే.. ఈ టీ పొడి ధర 50 గ్రాములు రూ.2 వేలు అంటే కిలో రూ.40వేలు. ధర తెలిసి సందర్శకులు విస్తుపోయారు. ఎందుకంత ధర? ఇందులో ఏముంది? అని ఆరా తీశారు. ప్రకృతి విధానంలో ఆక్సిజన్‌ అధికంగా వినియోగించి బాక్స్‌లలో ఒకటిన్నర ఏళ్లకు పైగా అతి జాగ్రత్తగా ఈ రెండు రకాలు పండించారట. పైగా ఆరోగ్యానికి శ్రేష్టమని చెప్పారు. దీనిని చైనీయులు ఇష్టపడి సేవిస్తుంటారని నిర్వహాకులు తెలిపారు. అదన్న మాట మ్యాటర్.