Abused Police: పోలీసును తిట్టిన వ్యక్తికి 1.7 సంవత్సరాల జైలు శిక్ష

ప్లాట్ ఫాంపై పడుకున్నాడని లేపితే పోలీసులను తిట్టాడు. 2020లో జరిగిన ఈ ఘటనకు రీసెంట్ గా తీర్పు ఇచ్చిన కోర్టు.. సంవత్సరం ఏడు నెలల పాటు జైలు శిక్ష విధించింది. 2020 నవంబర్ 24 అర్ధరాత్రి మారుతీ మొహితె అనే పోలీసు అధికారి సివిల్ డ్రెస్ లో ఉండి పాట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు.

Abused Police: పోలీసును తిట్టిన వ్యక్తికి 1.7 సంవత్సరాల జైలు శిక్ష

Man Gets One Year Jail For Pulling Ex Girlfriend’s Hand

 

 

Abused Police: ప్లాట్ ఫాంపై పడుకున్నాడని లేపితే పోలీసులను తిట్టాడు. 2020లో జరిగిన ఈ ఘటనకు రీసెంట్ గా తీర్పు ఇచ్చిన కోర్టు.. సంవత్సరం ఏడు నెలల పాటు జైలు శిక్ష విధించింది. 2020 నవంబర్ 24 అర్ధరాత్రి మారుతీ మొహితె అనే పోలీసు అధికారి సివిల్ డ్రెస్ లో ఉండి పాట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు.

సీఎస్ఎమ్టీ ప్లాట్ ఫాం 15పై ఓ వ్యక్తి పడుకుని ఉండటం గమనించి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఆ మాటకు ధిక్కార ధోరణితో సమాధానం చెప్తూ.. కదిలేది లేదని ఏం చేయాలో చేసుకొమ్మని సమాధానమిచ్చాడు. ఆ వ్యక్తిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి ఐపీసీ సెక్షన్ 353, సెక్షన్ 504కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఆర్కే క్షీర్‌సాగర్ మాట్లాడుతూ.. పబ్లిక్ డ్యూటీ చేస్తుండగా అవమానం ఎదుర్కొన్నారని నిరూపితమైందని, నిందితుడు క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు తెలిసిందని అన్నారు.

Read Also: పోలీస్ స్టేషన్‌లోనే తన్నుకున్నారు.. బాక్సింగ్ క్రీడను తలపించిన కొట్లాట.. వీడియో వైరల్

పన్వేల్ నివాసి అయిన రామేశ్వర్ రాథోడా, ప్రజా శాంతిని చెడగొట్టడం, నేరానికి పాల్పడినట్లుగా పబ్లిక్ డ్యూటీని నిర్వర్తిస్తున్నప్పుడు నిందితుడు మోహితను బెదిరించినట్లు.. ఇది శాంతి విఘాతాన్ని రెచ్చగొట్టడానికి దారితీసిందని కోర్టు పేర్కొంది.