Kiren Rijiju: జడ్జిల నియామకం ప్రభుత్వం చేయాలి.. కొలీజియంపై మరోసారి విమర్శలు గుప్పించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి
సుప్రీంకోర్టు కొలీజియం భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉంటుంది. ఈ కొలీజింయంలో న్యాయస్థానంలోని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. కొలీజియం సిఫార్సులకు సంబంధించి ప్రభుత్వం అభ్యంతరాలను లేవనెత్తవచ్చు లేదా వివరణలు కోరవచ్చు. అయితే ఐదుగురు సభ్యుల కొలీజియం నిర్ణయమే అంతిమంగా స్వీకరించాల్సి ఉంటుంది.

Law Minister Kiren Rijiju Questions Collegium System Again
Kiren Rijiju: జడ్జిల నియామకంలో కొలీజియం పాత్రపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి విరుచుకుపడ్డారు. కొలీజియం అనే వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందంటూ సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన అన్నారు. వాస్తవానికి జడ్జీల నియామకం ప్రభుత్వం చేయాల్సిన పని అని, కానీ దానికి విరుద్ధంగా నియామకాలు జరుగుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ ప్రచురించే ‘పాంచజన్య’ అనే వారపత్రిక సోమవారం అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘సబర్మతి సంవాద్’లో ఆయన మాట్లాడుతూ న్యాయమూర్తులలో సగం మంది నియామకాలను నిర్ణయించడంలో నిమగ్నమై ఉన్నారని, ఈ కారణంగా వారు అందించాల్సిన న్యాయంలో జాప్యం ఏర్పడుతోందని అన్నారు. అత్యున్నత న్యాయవ్యవస్థ నియామకాల కొలీజియం వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని గత నెలలో జైపూర్‌లో జరిగిన సదస్సులో మంత్రి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Viral Video: ఇద్దరి మధ్య గొడవ.. ప్రయాణిస్తున్న రైలు నుంచి ఒక వ్యక్తిని తోసేసిన మరొక వ్యక్తి
“1993 వరకు, భారతదేశంలోని ప్రతి న్యాయమూర్తిని భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి న్యాయ మంత్రిత్వ శాఖ నియమించింది. ఆ సమయంలో మాకు చాలా ప్రముఖ న్యాయమూర్తులు ఉన్నారు” అని న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై ఒక ప్రశ్నకు సమాధానంగా రిజిజు చెప్పారు. “రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది. న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. అంటే భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి న్యాయమూర్తులను న్యాయ మంత్రిత్వ శాఖ నియమిస్తుంది” అని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు కొలీజియం భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉంటుంది. ఈ కొలీజింయంలో న్యాయస్థానంలోని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. కొలీజియం సిఫార్సులకు సంబంధించి ప్రభుత్వం అభ్యంతరాలను లేవనెత్తవచ్చు లేదా వివరణలు కోరవచ్చు. అయితే ఐదుగురు సభ్యుల కొలీజియం నిర్ణయమే అంతిమంగా స్వీకరించాల్సి ఉంటుంది.
Delhi-Mumbai Express Highway: ఢిల్లీ-ముంబై మధ్య దూరాన్ని 12 గంటలకు తగ్గించడం నా కల.. గడ్కరి