Delhi-Mumbai Express Highway: ఢిల్లీ-ముంబై మధ్య దూరాన్ని 12 గంటలకు తగ్గించడం నా కల.. గడ్కరి

దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‭ప్రెస్‭వేగా గుర్తింపు పొందిన ఈ రోడ్డు.. మొదటి విడత పనులు ఈ యేడాదిలోనే పూర్తవుతాయని కేంద్ర మంత్రి గడ్కరీ మంగళవారం వెల్లడించారు. వాస్తవానికి ఢిల్లీ-ముంబై మధ్య ఉండే దూరాన్ని 12 గంటలకు తగ్గించడం తన కల అని.. ఆ పనులు తొందరలోనే పూర్తవుతాయని ఆయన అన్నారు. ఈ ఎక్స్‭ప్రెస్‭వే పనులను ఆయన హెలికాఫ్టర్ ద్వారా మంగళవారం పరిశీలించారు

Delhi-Mumbai Express Highway: ఢిల్లీ-ముంబై మధ్య దూరాన్ని 12 గంటలకు తగ్గించడం నా కల.. గడ్కరి

My dream is to cover distance between Delhi & Mumbai's Nariman Point in 12 hrs Gadkari

Delhi-Mumbai Express Highway: దేశంలో రెండు ప్రధానమైన నగరాలు, రద్దీగా ఉండే నగరాలు ముంబై, ఢిల్లీ. ఒకటి దేశానికి ఆర్థిక రాజధాని కాగా, మరొకటి దేశానికి రాజకీయ రాజధాని. అత్యధిక జనాభా, అనేక కార్యక్రమాలు, అనేక కార్యకలాపాలతో ఈ రెండు నగరాలు నిద్రనే మర్చిపోయాయి. ఇక ఈ రెండు నగరాల్లో ఉండే రద్దీ.. రెండు నగరాల మధ్య కూడా ఉంటుంది. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, విమానాలు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ.. ఈ రెండు నగరాల మధ్య రద్దీని తగ్గించడం సాధ్యం కావడం లేదు. రద్దీ తగ్గించడం కాదు కానీ, ప్రయాణాన్ని మరింత కాస్త సులభతరం చేసేలా ఇరు నగరాల మధ్య ఎక్స్‭ప్రెస్‭వేను రూపొందించి నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర రవాణాశాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధతో రహదారి డిజైన్ నుంచి నిర్మాణ పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‭ప్రెస్‭వేగా గుర్తింపు పొందిన ఈ రోడ్డు.. మొదటి విడత పనులు ఈ యేడాదిలోనే పూర్తవుతాయని కేంద్ర మంత్రి గడ్కరీ మంగళవారం వెల్లడించారు. వాస్తవానికి ఢిల్లీ-ముంబై మధ్య ఉండే దూరాన్ని 12 గంటలకు తగ్గించడం తన కల అని.. ఆ పనులు తొందరలోనే పూర్తవుతాయని ఆయన అన్నారు. ఈ ఎక్స్‭ప్రెస్‭వే పనులను ఆయన హెలికాఫ్టర్ ద్వారా మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన స్పందిస్తూ ‘‘నారిమన్ పాయింట్ (ముంబై) నుంచి ఢిల్లీ వరకు ఉన్న దూరాన్ని 12 గంటలకు తగ్గించడం నా కల’’ అని అన్నారు.

Elon Musk: ఇండియాలో స్టార్‌లింక్ సేవలు.. శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటర్నెట్.. అనుమతి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు