Elon Musk: ఇండియాలో స్టార్‌లింక్ సేవలు.. శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటర్నెట్.. అనుమతి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు

దేశంలో త్వరలోనే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎలన్ మస్క్ స్థాపించిన ‘స్టార్‌లింక్’ సంస్థ దీనికోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. కేంద్రం అనుమతిస్తే మరకొద్ది రోజుల్లోనే ఈ సేవలు మొదలవుతాయి.

Elon Musk: ఇండియాలో స్టార్‌లింక్ సేవలు.. శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటర్నెట్.. అనుమతి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు

Elon Musk: దేశంలో ‘స్టార్‌లింక్’ సేవలు ప్రారంభించేందుకు ఎలన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఈ సేవలందించేందుకు కావాల్సిన అనుమతుల కోసం కేంద్ర టెలికాం శాఖకు దరఖాస్తు చేసుకుంది.

Woman Bank Manager: బ్యాంకు దోపిడీకి కత్తితో వచ్చిన దుండగుడు.. మహిళా మేనేజర్ ఎలా పోరాడిందో చూడండి.. వైరల్ వీడియో

దీని ద్వారా ‘గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ సర్వీసెస్ (జీఎంపీసీఎస్) లైసెన్స్’ కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి సంబంధించిన అనుమతులు వస్తే మన దేశంలో స్టార్‌లింక్ సేవలు ప్రారంభమవుతాయి. ఇది స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. అంటే కేబుల్ లేదా మొబైల్ టవర్లు వంటివి లేకుండానే ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. ఇదే సంస్థ రూపొందించిన ప్రత్యేక డివైజ్‌తో ఎక్కడైనా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. మారుమూల ప్రాంతాల్లో కూడా దీని ద్వారా ఇంటర్నెట్ అందుతుంది. గతవారమే స్పేస్ ఎక్స్ సంస్థ దీనికోసం దరఖాస్తు చేసుకుంది. నిజానికి గత సంవత్సరమే దీని కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, వివిధ కారణాల వల్ల ఆ దరఖాస్తును కంపెనీ తిరిగి వెనక్కు తీసుకుంది.

తాజాగా మరోసారి ఈ సేవల్ని ప్రారంభించేందుకు దరఖాస్తు చేసింది. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ సంస్థ ఒక్కటే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలకు దరఖాస్తు చేసుకోగా, భవిష్యత్తులో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, కెనడాకు చెందిన టెలిశాట్, అమెజాన్ వంటివి కూడా ఈ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి.