Viral Video: ఇద్దరి మధ్య గొడవ.. ప్రయాణిస్తున్న రైలు నుంచి ఒక వ్యక్తిని తోసేసిన మరొక వ్యక్తి

షైక్‭తో ఒక వ్యక్తి గొడవ పడుతున్నాడు. ఇంతలో గొడవ కాస్త సద్దుమణిగింది. ఇంతలో రెచ్చగొట్టే విధంగా షైక్ ఏదో అన్నాడు. అంతే మళ్లీ ఇద్దరి మధ్య ముష్టియుద్ధం ప్రారంభమైంది. ఇలా గొడవ పడుతుండగానే.. వేరే ప్రయాణికుడు షైక్‭ను రైలు డోర్ వద్ద నుంచి కిందకు తోశాడు. ఆ తర్వాత ఏదో పని పూర్తి చేసి వచ్చి రిలాక్స్ అయినట్లు, అసలేమీ తెలియనట్టు.. వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.

Viral Video: ఇద్దరి మధ్య గొడవ.. ప్రయాణిస్తున్న రైలు నుంచి ఒక వ్యక్తిని తోసేసిన మరొక వ్యక్తి

Viral Video: పశ్చిమ బెంగాల్‭లో ఓ దారుణం వెలుగు చూసింది. ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ దారుణానికి దారి తీసింది. పరస్పర వాగ్వాదాల నడుమ తగువులాడుకుంటుండగా.. ఒక వ్యక్తిని ప్రయాణిస్తున్న రైలులో నుంచి తోసేశాడు మరొక వ్యక్తి. అంతే, శెనగలు తిన్న కవర్ పడేసి వచ్చి ఎంత రిలాక్స్‭డ్‭గా తన సీట్లో కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీర్భూం జిల్లాలోని తారాపిత్ రోడ్-రంపుర్హాత్ స్టేషన్ల మధ్య హౌరా-మాల్దా టౌన్ ఇంటర్సిటీ ఎక్స్‭ప్రెస్ రైలులో శనివారం రాత్రి జరిగిందీ ఈ సంఘటన. అయితే ఇందులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు రైల్వే పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు.

రైలు నుంచి కింద పడిన వ్యక్తిని సజల్ షైక్ అని పోలీసులు గుర్తించారు. వాస్తవానికి అతడు రైలు ప్రయాణంలో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించాడట. మహిళా ప్రయాణికులను బెదిరిస్తూ, తోటి ప్రయాణికులపై కాళ్లు వేస్తూ, ఇతరులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించాడట. దీంతో తోటి ప్రయాణికులు అతడితో గొడవ పడాల్సి వచ్చింది. ఈ సందర్భంలోనే ఒక వ్యక్తి అతడిని ప్రయాణిస్తున్న రైలు నుంచి బయటికి తోసేసినట్లు పోలీసులు తెలిపారు.

Woman Bank Manager: బ్యాంకు దోపిడీకి కత్తితో వచ్చిన దుండగుడు.. మహిళా మేనేజర్ ఎలా పోరాడిందో చూడండి.. వైరల్ వీడియో

వీడియో ప్రకారం.. షైక్‭తో ఒక వ్యక్తి గొడవ పడుతున్నాడు. ఇంతలో గొడవ కాస్త సద్దుమణిగింది. ఇంతలో రెచ్చగొట్టే విధంగా షైక్ ఏదో అన్నాడు. అంతే మళ్లీ ఇద్దరి మధ్య ముష్టియుద్ధం ప్రారంభమైంది. ఇలా గొడవ పడుతుండగానే.. వేరే ప్రయాణికుడు షైక్‭ను రైలు డోర్ వద్ద నుంచి కిందకు తోశాడు. ఆ తర్వాత ఏదో పని పూర్తి చేసి వచ్చి రిలాక్స్ అయినట్లు, అసలేమీ తెలియనట్టు.. వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.

తీవ్రగా గాయపడ్డ షైక్‭ను జీఆర్‭పీ పోలీసులు రక్షించి రాంపూర్హాట్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తాను సైంథియా నుంచి వస్తున్నట్లు ఆస్పత్రి బెడ్ మీద నుంచే పోలీసులకు ఇచ్చి వాంగ్మూలంలో షైక్ చెప్పాడు. తోటి ప్రయాణీకుల దురుసుగా ప్రవర్తిస్తే తాను వ్యతిరేకించానని, అందుకు వారు తనతో గొడవపడి రైలులో నుంచి తోసేశారని అతడు తెలిపాడు.

Anasuya Bharadwaj: బెంగళూరు విమానాశ్రయంలో అనసూయకు అవమానం.. బట్టలు చిరిగేలా సిబ్బంది ప్రవర్తన!

‘‘నేను మా ఇంటికి వెళ్తున్నాను. నేను ప్రయాణిస్తున్న కంపార్ట్‭మెంట్‭లో ముగ్గురు-నలుగురు వ్యక్తులు కబుర్లు చెప్పుకుంటున్నారు. అయితే చాలా అసభ్యమైన పదజాలంతో మాట్లాడుకుంటున్నారు. పక్కనే కుటుంబం ఉంది. దీంతో నేను వారిని అలా ప్రవర్తించవద్దని చెప్పాను. అదే నా తప్పైంది. వారిలో ఒక వ్యక్తి లేచి నా కాలర్ పట్టుకుని బెదిరించాడు. అతడిని బయపెట్టడానికి నేను బ్లేడు తీశాను. అంతే, ఆ తర్వాత నాపై దాడి చేసి, నన్ను బయటికి తోసేశారు’’ అని షైక్ తెలిపాడు. ఈ విషయంపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.