Vaccine Certificate: వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లాగే డెత్ సర్టిఫికేట్‌పైనా మోడీ ఫొటో ఉండాలి – మంత్రి

ఇండియాలో కొవిడ్-19 కారణంగా మృతులు పెరుగుతూనే ఉన్నాయి. కొద్ది నెలలుగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో వ్యాక్సిన్..

Vaccine Certificate: వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లాగే డెత్ సర్టిఫికేట్‌పైనా మోడీ ఫొటో ఉండాలి – మంత్రి

Vaccination Certificate

Vaccine Certificate: ఇండియాలో కొవిడ్-19 కారణంగా మృతులు పెరుగుతూనే ఉన్నాయి. కొద్ది నెలలుగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి సర్టిఫికేట్లు ఇస్తున్నారు. దానిపై ప్రధాని మోడీ బొమ్మ ఉన్నట్లుగానే కొవిడ్ తో బాధపడుతూ చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్లపైనా ఉండాలని ఎన్సీపీ లీడర్, మహారాష్ట్ర మినిష్టర్ శనివారం విమర్శలు చేశారు.

ప్రధాని వ్యాక్సినేషన్ ఇప్పించినందుకు క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నాడు. అలాగే కొవిడ్ నష్టాలకు కూడా బాధ్యత వహించాలి. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లపై పీఎం మోడీ ఫొటో ఉంచినట్లుగానే.. డెత్ సర్టిఫికేట్ల మీద కూడా ఉంచాలి. కొవిడ్ 19 వ్యాక్సినేషన్ క్రెడిట్ కావాలనుకుంటే.. ఆ చావుల బాధ్యత కూడా మోయాలి.

దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న కొద్దీ కొవిడ్ మృతులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అంత్యక్రియలకు కూడా సరిపోక స్మశానాలు శవాలతో నిండిపోయిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు కేంద్రమే సమాధానం చెప్పాలి.

ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలు వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై పీఎం మోడీ ఫొటో ఉండటాన్ని తీవ్రంగా ఖండించాయి. ఓటర్లను ప్రభావితం చేయడానికే ఇలా చేస్తున్నారని విమర్శించాయి.