స్కూటర్‌పై స్కూలు..విద్యార్ధులు ఉన్నచోటికే వచ్చి పాఠాలు చెబుతున్న టీచర్

స్కూటర్‌పై స్కూలు..విద్యార్ధులు ఉన్నచోటికే వచ్చి పాఠాలు చెబుతున్న టీచర్

School On A Scooter

School on a scooter : రైలు బండి స్కూలు..బస్సుల్లో స్కూళ్ల గురించి విన్నాం. కానీ స్కూటర్ పైనే కదిలే స్కూల్ ను మీరెప్పుడైనా చూశారా?అంటే కాస్త ఆలోచించాల్సిందే. మనస్సుంటే మార్గం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ డ్యూటీ వదలకుండా…విద్యార్ధులకు చదువు చెప్పాలనే తపన ఉండాలేగానీ ఎలాగైనా చేయొచ్చు అని నిరూపించారు మధ్యప్రదేశ్ లోని ఓ గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లు పాఠాలు సరిగా చెప్పరు అనే వారు ఈయన గురించి తెలిస్తే ‘హ్యాట్సాఫ్ టీచరయ్యా’’అంటారు.

2

ఈ కరోనా కష్టకాలంలో స్కూళ్లన్నీ మూతపడ్డాయి. టీచర్లు, విద్యార్ధుల ఇళ్లకే పరిమితమైపోతాయారు. ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నా చదువులు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. దీంతో విద్యార్ధులు చదువులకు దూరమువుతున్నారు. ఇది మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ స్కూల్లో పనిచేసే సీహెచ్. శ్రీవాస్తవ అనే మాస్టారుకి నచ్చలేదు. పిల్లలకు పాఠాలు చెప్పకుండా జీతాలు తీసుకోవటం సరికాదు..పిల్లలు చదువుకు దూరం కావటం సరికాదు అనుకున్నారు. అంతే తన స్కూటర్ నే స్కూల్ లా మార్చేశారు. పేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లను కొనివ్వడమేకాదు, తనకున్న పరిమితమైన వనరులతో విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండేలా చొరవ తీసుకోవడం ప్రశంసనీయంగా నిలిచింది. శ్రీవాస్తవ తన స్కూటర్‌పై మినీ లైబ్రరీని ఏర్పాటు చేసి సాగర్‌లోని వివిధ గ్రామాల్లోని విద్యార్థులకు బోధిస్తున్నారు.

3

శ్రీ వాస్తవ పనిచేసే స్కూల్లో చాలామంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులున్నారు. వారికి స్మార్ట్‌ఫోన్‌లు కొని చదువుకోలేని పరిస్థితి. దీంతో ఆన్‌లైన్ విద్యను పొందలేకపోతున్నారు. దీంతో శ్రీవాస్తవ పేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లను కొనిచ్చారు. కానీ ఆన్ లైన్ విద్య పొందాలంటే ఫోన్ లో ఇంటర్ నెట్ ఉండాలి. అదికూడా వేయించుకోలేని పరిస్థితిలో ఉన్న విద్యార్ధుల కోసం తనకు తోచిన సహాయం చేసేవారు. కానీ అన్ని ప్రాంతాల్లోను నెట్ వర్క్ సమస్యలే. దీంతో తన స్కూటర్ నే స్కూల్ గా మార్చేశారు శ్రీ వాస్తవ.

Wom

తన సహాయ సహకారాలు కానీ తన స్కూలు వరకే కాకుండా సాగర్‌ జిల్లాలోని విద్యార్ధుల పరిస్థితి ఏంటీ? అని ఆలోచించారు. విద్య లేకుండా పిల్లలు ఉండకూడదనుకున్నారు. దీంతో తన స్కూటర్ నే స్కూల్ గా మార్చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ విద్యార్థులను ఒక చోట చేర్చి వారి వద్దకే వెళ్లి పాఠాలు చెబుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ తన స్కూటర్ స్కూలుపై పలు గ్రామాలు తిరుగుతారు. విద్యార్ధులకు పుస్తకాలు కూడా కొనిచ్చి పాఠాలు చెబుతున్నారు శ్రీవాస్తవ.

4

స్కూటర్ స్కూల్ గురించి టీచర్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ..కరోనా వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఆన్ లైన్ క్లాసులు వినటానికి స్మార్ట్ ఫోన్లు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో చాలామంది పేద విద్యార్ధులున్నారు. అటువంటివారికి తన శక్తి మేరకు కొంతమందికి స్మార్ట్‌ఫోన్‌లను కొని ఇచ్చానని, అలాగే పుస్తకాలు కొనలేని విద్యార్థులకు బుక్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చానన్నారు. తన లైబ్రరీలోని పుస్తకాలను 2-3 రోజులు విద్యార్దులకు ఇచ్చి చదువుకోమని చెబుతున్నానని అలాగే వారికి పాఠాలు చెబుతున్నానని తెలిపారు. తాను ఇచ్చే పుస్తకాలు పిల్లలతో విద్యార్ధులు నోడ్స్ రాసుకుని తిరిగి ఇచ్చేస్తే అవి వేరే విద్యార్ధులకు ఇస్తానని తెలిపారు. ఏది ఏమైనా పిల్లలు చదువుకోవడమే తన లక్ష్యమని టీచర్ శ్రీ వాస్తవ తెలిపారు. ఈ కరోనా మహమ్మారి కాలంలో పేద విద్యార్ధుల గురించి టీచర్ శ్రీవాస్తవ చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.