అందరూ ఓటేటీ సినిమాలంటే, ఇతను ఏకంగా Porn OTTని ఎర్పాటుచేశాడు. పాకిస్తానీయుల సపోర్ట్ తీసుకున్నాడు

అందరూ ఓటేటీ సినిమాలంటే, ఇతను ఏకంగా Porn OTTని ఎర్పాటుచేశాడు. పాకిస్తానీయుల సపోర్ట్ తీసుకున్నాడు

పాకిస్తాన్ వ్యక్తులతో కలిసి పోర్న్ ఓటీటీ నిర్వహిస్తున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో మొత్తం ఆరుగురు ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించారు. పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఈ సర్వీసు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. మంగళవారం పోలీసులు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో పాటు ఇంకొకరిని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 30సంవత్సరాల వయస్సున్న దీపక్ సైనీ, 27ఏళ్ల కేశవ్ సింగ్ గా గుర్తించారు.

ఈ ఓటీటీ సర్వీసు కనీసం 22దేశాల్లో ప్రసారం అయింది. ఈ పని చేయడానికి పాకిస్తాన్ కు చెందిన హుస్సేన్ అలీగా గుర్తించారు. ఈ సర్వీస్ నిర్వహించడానికి అతనే పూర్తి సహకారం అందిస్తున్నాడు. ఆగష్టు 10న పోర్న్ స్ట్రీమింగ్ సర్వీస్ లో నిందితులైన ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఏడుగురు ఇంకా పరారీలోనే ఉన్నారు.

ఐటీ చట్టం ప్రకారం.. సెక్షన్స్ 66, 67లపై వారిపై కేసులు ఫైల్ అయ్యాయి. ఈ సర్వీసును పాక్ దేశస్థుడు హుస్సేన్ అలీ మెయింటైన్ చేస్తున్నాడు. ఇందులో ఆ వ్యక్తి ఎంతవరకూ ఇన్వాల్వ్ అయ్యాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సైనీ, సింగ్ డిస్ట్రిబ్యూటర్లకు అటువంటి సినిమాలకు రూ.5 లక్షల వరకూ చెల్లిస్తూ వస్తున్నారు. ఈ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వారు సొమ్ములు చేసుకుంటూ వస్తున్నారు. ఈ సబ్‌స్క్రిప్షన్ కు నెలకు రూ.249. సంవత్సర కాలంలో అదే ప్లాట్ ఫాంపై 84సినిమాలు ప్రసారం చేశారు.’ అని సైబర్ సెల్ ఎస్పీ జితేందర్ సింగ్ అన్నారు.

ఈ పోర్న్ రాకెట్ జులై 25నే బయటపడింది. ఇండోర్ మోడల్ సైబర్ సెల్ ను ఆశ్రయించి తాను సంతకం పెట్టిన వెబ్ సిరీస్ లో అభ్యంతరకర సీన్లు షూట్ చేసి వాటిని పోర్న్ సైట్లో అప్ లోడ్ చేస్తున్నారని కంప్లైంట్ చేసింది. ‘ఆ తర్వాత మరి కొందరు మహిళలు.. ఆ మోడలింగ్ ఏజెన్సీ మీద కంప్లైంట్ చేశారు. మూవీ డైరక్టర్ బిజేంద్ర గుర్జార్, కెమెరా మెన్ అంకిత్ చావ్వాలతో పాటు మరో ముగ్గురిని ఆగష్టు 10న పోలీసులు అరెస్టు చేశారు.