Madras HC : ’అయ్యో..మగవాళ్లకు గృహ హింస చట్టం లేదే‘

Madras HC  : ’అయ్యో..మగవాళ్లకు గృహ హింస చట్టం లేదే‘

Madras Hc

Madras high court Sensational comments: మహిళల కోసం గృహ హింస చట్టం ఉంది. కానీ హింసలు జరుగుతునే ఉన్నాయి. ఇదిలా ఉంటే కానీ మగవాళ్లకు గృహహింస చట్టం గురించి మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సస్పెండైన ఓ అధికారిని తిరిగి డ్యూటీలో నియమిస్తూ..ధర్మాసనం ‘అయ్యో..మగవాళ్లకు గృహ హింస చట్టం లేదే..’ అంటూ వ్యాఖ్యానించింది. మద్రాస్ అత్యున్నత ధర్మాసనం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘భార్యా భర్తలు చాలా సమన్వయంతో కుటుంబాన్ని నిర్వహించాలి. అహం..అసహనాలు మనం కాళ్లకు ధరించే చెప్పులు వంటివి..వాటిని ఇంటి బయటే వదిలేయాలి. ఇంటిలోపలికి తెచ్చుకుంటే కుటుంబం అంతా అపార్ధాలతో నిండిపోతుంది. తద్వారా భార్యాభర్తలే కాదు వారి పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థమవతుందని పలు కీలక సూచనలు చేసింది.

ఈ వింత కేసు వివరాల్లోకి వెళితే.. పి.శశికుమార్ అనే డాక్టర్ చెన్నైలో పశు సంవర్థక శాఖలో డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఈక్రమంలో ఆయన భార్య శశికుమార్ పై గృహ హింస చట్టం కింద కేసు పెట్టడంతో సస్పెండ్ కు గురయ్యారు. సస్పెండ్ అయిన తరువాత కూడా డాక్టర్ భార్య అతన్ని పలు రకాలుగా మాటలతో హింసించింది. భార్య చేతిలో నరకం చూసిన డాక్టర్ ఇక భరించలేనంటూ ఆమెను వదలి దూరంగా పారిపోయాడు. ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. ఈ కేసు విచారణ పూర్తి అయ్యాక మరో నాలుగు రోజుల్లో విడాకులు మంజూరు అయ్యేవి. ఈ విడాకులకు కేసు తీర్పు వచ్చే ముందు..డాక్టర్ శశికుమార్ భార్య గృహ హింస కేసు పెట్టింది.

ఈ సందర్భంగా కేసు విచారిస్తున్న క్రమంలో హైకోర్టు జస్టిస్ వైద్యనాథన్..ఈ కేసు ఎలా కనిపిస్తోందంటే..విడాకులు వచ్చేస్తే ఇక భర్తను హింసించడం కుదరదని..అందుకే ఆయన్ని మరింతగా ఇబ్బంది పెట్టాలని ఆమె గృహ హింస కేసు పెట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. అంతేకాదు..ఓ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతీ భార్యా భర్తలకు ఉంది. అహం,అసహనం అనేవి… మనం ధరించే చెప్పుల లాంటివి. వాటిని ఇంటి బయటే వదిలేయాలి తప్ప లోపలికి తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే… భార్యాభర్తలతోపాటు వారి పిల్లల భవిష్యత్తు కూడా నాశనమయ్యే అవకాశముంది కాబట్టి సమన్వయం అనేది ఇద్దరికీ అవసరమని సూచించారు.

కాగా..2015లో సాలెం ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకోగా ఫిబ్రవరి 2020లో విడాకులకు అనుమతిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని లెక్కలోకి తీసుకున్న హైకోర్టు ఆయన్ని శాఖ నుంచి సస్పెండ్ చెయ్యాల్సిన పనిలేదనీ… మరో 15 రోజుల్లో తిరిగి ఉద్యోగంలో చేర్చాలని తీర్పు ఇచ్చింది. ఈ కేసు ఆధారంగా పోలీసులు డాక్టర్ శశికుమార్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు.దీంతో అయన శాఖాపరంగా సస్పెండ్ అయ్యారని జస్టిస్ వైద్యనాథన్ ఈ సందర్భంగా తెలిపారు.