Seema Haider vs Raj Thackeray: సీమా హైదర్ కాంట్రవర్సీలో కొత్త ట్విస్ట్.. రంగంలోకి రాజ్ థాకరే టీం. చెప్పింది వినకపోతే రంగు పడుద్దంటూ బెదిరింపులు

దేశ వ్యతిరేక సినిమా నిర్మాతలు ఎందుకు సిగ్గుపడరని అమేయా ఖోప్కర్ అన్నారు. తమ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని, వినక పోతే బురదలో ముంచేస్తామని హెచ్చరించారు

Seema Haider vs Raj Thackeray: సీమా హైదర్ కాంట్రవర్సీలో కొత్త ట్విస్ట్.. రంగంలోకి రాజ్ థాకరే టీం. చెప్పింది వినకపోతే రంగు పడుద్దంటూ బెదిరింపులు

Updated On : August 13, 2023 / 3:20 PM IST

Seema Haider vs MNS: సీమ హైదర్ కాంట్రవర్సీలోకి రాజ్ థాకరే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఎంట్రీ ఇచ్చింది. సీమీ హైదర్ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రాన్ని వెంటనే ఆపాలని ఎంఎన్ఎస్ నుంచి కఠినమైన బెదిరింపు వచ్చింది. ఒక వేళ తాము చెప్పినట్టు వినకపోతే రచ్చ రచ్చ చేస్తామని హెచ్చరించింది. పాకిస్తాన్ నుంచి నేపాల్ ద్వారా భారతదేశానికి వస్తున్న సీమా హైదర్ నిరంతరం చర్చలో ఉన్నారు. తాజాగా సీమకు ‘కరాచీ టు నోయిడా’ సినిమా ఆఫర్ వచ్చింది.

Viral Video: లిఫ్టులో ఇరుక్కున్న ఆమెకు, ఆమె బిడ్డ ప్రాణాలకు ఆ డెలివరీ బాయ్ తన ప్రాణాలను అడ్డుపెట్టాడు

ఇకపోతే, ఈ విషయానికి సంబంధించి రాజ్ థాకరే పార్టీ ఎంఎన్ఎస్ బాలీవుడ్‌లో సీమా ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సీమకు సినిమాలో నటించే అవకాశం కల్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి, మహారాష్ట్ర నవనిర్మాణ్ ఫిల్మ్ కర్మచారి సేన అధ్యక్షుడు అమీ ఖోప్కర్ హెచ్చరించారు. దేశ వ్యతిరేక సినిమా నిర్మాతలు ఎందుకు సిగ్గుపడరని అమేయా ఖోప్కర్ అన్నారు. తమ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని, వినక పోతే బురదలో ముంచేస్తామని హెచ్చరించారు. ముంబైలోని ఓ ప్రొడక్షన్ హౌస్ సీమా హైదర్‌కి సినిమాలో నటించేందుకు ఆఫర్ చేసింది.

Maharashtra Politics: ఇండియా కూటమిలోకి అజిత్ పవార్.. ఎలా సాధ్యమో చెప్పిన సంజయ్ రౌత్

అమిత్ జానీ తన ప్రొడక్షన్ హౌస్ ‘జానీ ఫైర్‌ఫాక్స్’లో నటించడానికి పాకిస్థానీ సీమా హైదర్‌ని ఆఫర్ చేశారు. జానీ కొన్ని నెలల క్రితం ముంబైలో కార్యాలయం తెరిచారు. సీమా హైదర్‌తో పాటు, ఉదయపూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసుపై ‘ట్రైలర్’ అనే చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నారు.