Viral Video: లిఫ్టులో ఇరుక్కున్న ఆమెకు, ఆమె బిడ్డ ప్రాణాలకు ఆ డెలివరీ బాయ్ తన ప్రాణాలను అడ్డుపెట్టాడు
ప్రజలు డెలివరీ బాయ్‌ని అభినందిస్తున్నారు. ఒక యూజర్.. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘ధైర్యవంతుడు’ అని కొనియాడారు. ఇది పురుషులో లేదంటే స్త్రీలకో సంబంధించినది కాదని, ఇది మానవత్వంలో ఉన్న మంచితనం గురించని, అది చాలా అందంగా ఉందని మరొక యూజర్ అన్నారు.

Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో హృదయానికి హత్తుకునేది. ఎందుకంటే.. మహిళను, చిన్నారిని ఒక డెలివరీ బాయ్ కాపాడాడు. బహుశా అతడే లేకుంటే వాళ్లు ఏమయ్యేవారో. అందుకే నెటిజెన్లు ఆ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. పెద్ద భవనంలోని లిఫ్ట్‌లో ఒక డెలివరీ బాయ్ ఉన్నాడు. అందులోనే ఓ మహిళ తన చిన్న పిల్లాడితో వస్తుంది. మహిళ లిఫ్ట్‌లోకి ప్రవేశించిన వెంటనే, కొంత సమయం తర్వాత లిఫ్ట్ వేగంగా కిందకి వెళ్లడం ప్రారంభించింది. అంతే, మహిళను, బిడ్డను గాయపడకుండా సదరు డెలివరీ బాయ్ ఎలా కాపాడాడో లిఫ్ట్‌లో అమర్చిన సీసీటీవీలో రికార్డైంది.
View this post on Instagram
లిఫ్ట్ వేగంగా కిందకు వెళ్తోంది. డెలివరీ బాయ్ ఒక చేత్తో అలారం బటన్‌ను నొక్కుతూ.. మరో చేత్తో మహిళను, ఆమె బిడ్డకు పట్టుకున్నాడు. అనంతరం ఒక ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే వారిని అందులో నుంచి బయటికి పంపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు డెలివరీ బాయ్‌ని అభినందిస్తున్నారు. ఒక యూజర్.. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘ధైర్యవంతుడు’ అని కొనియాడారు. మొదట మహిళను,ఆమె బిడ్డను రక్షించి.. అనంతరం అతడు లిఫ్ట్ నుంచి బయటికి వచ్చాడు. అయితే ఇది పురుషులో లేదంటే స్త్రీలకో సంబంధించినది కాదని, ఇది మానవత్వంలో ఉన్న మంచితనం గురించని, అది చాలా అందంగా ఉందని మరొక యూజర్ అన్నారు.