Man Dances With Crocodile: నీళ్ల‌లో మొస‌లితో డ్యాన్స్ చేసిన వ్య‌క్తి.. త‌రువాత ఏం జ‌రిగిందంటే.. వీడియో వైర‌ల్

ఫ్లోరిడాకు చెందిన ఓ వ్య‌క్తి కొల‌నులో ముస‌లితో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో పాత‌దైన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం నెటింట్లో ట్రెండింగ్‌లో కొన‌సాగుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Man Dances With Crocodile: నీళ్ల‌లో మొస‌లితో డ్యాన్స్ చేసిన వ్య‌క్తి.. త‌రువాత ఏం జ‌రిగిందంటే.. వీడియో వైర‌ల్

Man Dancing With crocodile

Man Dances With Crocodile: చాలా మంది పురుషులు భార్య, పిల్లలు, పెంపుడు కుక్కలతో డ్యాన్స్ చేస్తూ ఉండే వీడియోలు త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తుంటాయి. కానీ, ప్లోరిడాకు చెందిన ఓ వ్య‌క్తి కొల‌నులో మొస‌లితో డ్యాన్స్ చేశాడు. అదీ మామూలు డ్యాన్స్ కాదు.. రొమాంటిక్ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Viral Video: పెళ్లికొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి కన్నీరు ఆపుకోలేకపోయిన పెళ్లికూతురు

ఈ వీడియో ఈ ఏడాది ఏప్రిల్‌లో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. తాజాగా మ‌రోసారి ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రు ఈ వీడియోను చూసి.. బాబోయ్ మొస‌లితోనే తామాషా చేస్తున్నావా బ్రో అంటూ రాయ‌గా, మ‌రో నెటిజ‌న్ అదేమైనా నీ పెళ్లాం లేదా గ‌ర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావా అంటూ కామెంట్ చేశారు.

ఈ వీడియోలో స‌న్నివేశం ప్లోరిడాలోని హోమ్‌సెడ్‌లోని ఎవ‌ర్‌గేడ్స్ అవుట్ పోస్ట్ వ‌ద్ద చోటు చేసుకుంది. బోర్న్ ఏకాంగ్ అనే ట్విట‌ర్ ఖాతాదారు షేర్ చేశాడు. వీడియోకు ప్లోరిడా మ‌నిషి మ‌ళ్లీ కొట్టాడు అంటూ శీర్షిక ఇచ్చాడు. ఈ వీడియోకు15.6 మిలియన్లకు పైగా నెటిజ‌న్లు వీక్షించ‌గా, 456k లైక్‌లు వ‌చ్చాయి. ఈ వీడియోలో మొస‌లి ముఖాన్ని ఓ వ్య‌క్తి ముద్దుపెట్టుకుంటూ డ్యాన్స్ చేస్తున్న‌ట్లు ఉంది. నెటిజ‌న్ల‌ను వీడియోలో స‌న్నివేశం ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.