Viral Video: పెళ్లికొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి కన్నీరు ఆపుకోలేకపోయిన పెళ్లికూతురు

తనకు కాబోయే భార్యకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని వరుడు భావించాడు. ఏం చేస్తే ఆమె అమితంగా సంతోషపడుతుందో ఆ పని చేయాలనుకున్నాడు. ఆమె విద్యార్థులను తమ పెళ్లికి ఆహ్వానించాడు. పెళ్లి జరుగుతుండగా ఆ విద్యార్థులు పూలు, ఉంగరాలు తీసుకుని వస్తూ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. వారిని చూసిన వధువు సంతోషంతో కన్నీరు ఆపుకోలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Viral Video: పెళ్లికొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి కన్నీరు ఆపుకోలేకపోయిన పెళ్లికూతురు

Viral Video: పెళ్లి సమయంలో కొందరు వధూవరులకు సర్‌ప్రైజ్ గిఫ్టులు ఇస్తుంటారు. అయితే, ఓ పెళ్లిలో వధువుకి వరుడు సర్‌ప్రైజ్ గిఫ్టు ఇచ్చి మరింత ఆశ్చర్యపర్చాడు. డౌన్ సిండ్రోమ్ (జన్యు సంబంధ వ్యాధి)తో బాధపడుతున్న చిన్నారులకు ఓ యువతి పాఠాలు చెప్పేది. ఆమెకు ఓ యువకుడితో పెళ్లి జరుగుతోంది. తనకు కాబోయే భార్యకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని వరుడు భావించాడు. ఏం చేస్తే ఆమె అమితంగా సంతోషపడుతుందో ఆ పని చేయాలనుకున్నాడు.

ఆమె విద్యార్థులను తమ పెళ్లికి ఆహ్వానించాడు. పెళ్లి జరుగుతుండగా ఆ విద్యార్థులు పూలు, ఉంగరాలు తీసుకుని వస్తూ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. వారిని చూసిన వధువు సంతోషంతో కన్నీరు ఆపుకోలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. వరుడు పెళ్లి జరుగుతోన్న సమయంలోనే వధువు గురించి బాగా ఆలోచించి మంచి పని చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ అమ్మాయికి అర్థం చేసుకునే భర్త దొరికాడని పేర్కొంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..