రెచ్చిపోయారు : బీజేపీ నేత ఇంటిని పేల్చేశారు

బీహార్ : సార్వత్రిక ఎన్నికల వేళ గయా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ నేత ఇంటిని డైనమేట్ తో పేల్చేశారు. ఎమ్మెల్సీ అనూజ్ కుమార్ సింగ్ ఇంటిని మావోయిస్టులు

  • Edited By: veegamteam , March 28, 2019 / 04:22 AM IST
రెచ్చిపోయారు : బీజేపీ నేత ఇంటిని పేల్చేశారు

బీహార్ : సార్వత్రిక ఎన్నికల వేళ గయా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ నేత ఇంటిని డైనమేట్ తో పేల్చేశారు. ఎమ్మెల్సీ అనూజ్ కుమార్ సింగ్ ఇంటిని మావోయిస్టులు

బీహార్ : సార్వత్రిక ఎన్నికల వేళ గయా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ నేత ఇంటిని డైనమేట్ తో పేల్చేశారు. ఎమ్మెల్సీ అనూజ్ కుమార్ సింగ్ ఇంటిని మావోయిస్టులు కూల్చేశారు. పేలుడు సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎన్నికలు బహిష్కరించాలని ఘటనాస్థలంలో మావోలు పోస్టర్లు వదిలి వెళ్లారు. లేదంటే ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. బుధవారం(మార్చి 28, 2109) రాత్రి ఈ ఘటన జరిగింది.

మావోయిస్టుల చర్య కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మార్చి 16న గయా జిల్లాలో ప్రభుత్వ స్కూల్ భవనాన్ని మావోలు ధ్వంసం చేశారు. ఎన్నికల వేళ అలజడి సృష్టించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని, ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. మావోయిస్టుల కోసం వేట ప్రారంభించారు. పోలీసులు, ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.