ఇంటి అద్దె కట్టలేక వలస కార్మికుడి సూసైడ్

  • Published By: Subhan ,Published On : May 20, 2020 / 08:12 AM IST
ఇంటి అద్దె కట్టలేక వలస కార్మికుడి సూసైడ్

45 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి విషం తాగి అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఇంటి ఓనర్ తరచూ అద్దె కట్టమంటూ వేధిస్తుండటమే ఆత్మహత్మకు కారణమని లెటర్ లో రాసి సూసైడ్ చేసుకున్నాడు. పొరుగింట్లో ఉండే వ్యక్తి తన ఇంటి యజమాని బలవంతంగా ఇంటి అద్దె వసూలు చేస్తూ ఉంటాడని ఫిర్యాదు చేస్తున్నాడు. 

మృతుడి కుటుంబం ఒడిశాలోని కంటోన్మెంట్ జోన్ లో ఉంటున్న కారణంగా శవాన్ని తీసుకెళ్లలేకపోయింది. గురుగ్రాంలో ప్లంబర్ గా పనిచేసుకుంటున్న వ్యక్తిని ఆదివారం నిద్రలేపేందుకు పక్కింట్లో ఉండే వ్యక్తి వచ్చాడు. ‘సుమారు ఆరు గంటలకు అతణ్ని నిద్రలేపేందుకు అతని గదికి వెళ్లాను. డోర్ కొడుతూనే ఉన్నా తీయడం లేదు. అనుమానం వచ్చి మా ఇంటి యజమానిని అడిగాను’

‘కింది ఫ్లోర్ లో ఉండే వ్యక్తి పైకి వచ్చి చెక్ చేశాడు. ఆయన పిలిచినా లోపలి నుంచి సమాధానం రాలేదు. పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేశాం. తలుపు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లాం. అతని శరీరం నేలపై పడి ఉంది. అతని పక్కనే ఖాళీ విషం ప్యాకెట్ పడి ఉంది. 

రెండ్రోజుల ముందు ఇంటి యజమాని అద్దె కావాలని బలవంతం చేస్తున్నట్లు చెప్పాడు. ఒత్తిడికి గురై పాయిజన్ తీసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. రూ.6వేల అద్దె ఇచ్చుకోలేని వ్యక్తిని అద్దె కావాలంటూ బలవంత పెట్టడం వల్లనే చనిపోయాడని ఇంటి యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. 

తెలంగాణ గవర్నమెంట్ లాగానే ఏప్రిల్ లో హర్యానా ప్రభుత్వం కూడా ఇంటియజమానులకు సూచనలు ఇచ్చింది. వలస కార్మికుల నుంచి అద్దెను డిమాండ్ చేయవద్దు. అద్దె ఇవ్వలేని పక్షంలో ఇల్లు ఖాళీ చేయాలని అనొద్దని వారి వద్ద ఉన్నప్పుడే తీసుకొమ్మని ఆదేశాలు ఇచ్చింది. 

Read: గాయపడిన తండ్రిని సైకిల్ ఎక్కించుకుని..1200 కి.మీటర్లు తొక్కుతూ సొంతూరుకు చేరిన బాలిక