Population Control Bill: చైనాతో పోల్చుతూ జనాభా నియంత్రణ బిల్లు ఎందుకు కీలకమో చెప్పిన కేంద్ర మంత్రి

1978లో చైనా జీడీపీ ఇండియా జీడీపీ కంటే తక్కువగా ఉంది. కానీ నేడు పరిస్థితి అలా లేదు. మన దేశం కంటే చైనాది నాలుగు రెట్లు ఎక్కువ జీడీపీ ఉంది. వాళ్లు ఒకే బిడ్డ విధానంతో వారి జనాభాను 60 కోట్లకు కుదించే ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు. మనం కూడా జనాభా నియంత్రణ చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి’’ అని అన్నారు. అయితే ఈ పాలసీని పాటించని వారికి కేంద్ర మంత్రి ఒక హెచ్చరిక చేశారు

Population Control Bill: చైనాతో పోల్చుతూ జనాభా నియంత్రణ బిల్లు ఎందుకు కీలకమో చెప్పిన కేంద్ర మంత్రి

Minister Giriraj Singh stresses on need to implement Population Control Bill

Updated On : November 27, 2022 / 5:46 PM IST

Population Control Bill: జనాభా నియంత్రణ బిల్లును మన దేశంలో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. మన దేశంలో ఉన్న పరిమిత వనరుల దృష్ట్యా, ఈ బిల్లు ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనాతో పోల్చుతూ మన దేశానికి ఈ బిల్లు ఎంత అవసరమో, ఎంత కీలకమో తెలిపే ప్రయత్నం చేశారు.

Satyendar Jain: ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‭కు జైలులో సకల వసతులు.. ఆయన కోసం 10 మంది సేవకులు!

‘‘చైనాలో ఒకే బిడ్డ పాలసీని కఠినంగా అమలు చేసి జనాభాను నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఈరోజు ఆ దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇప్పుడు ఆ దేశంలో ప్రతి నిమిషానికి 10 మంది పిల్లలు పుడుతుంటే, మన దేశంలో నిమిషానికి 30 మంది పిల్లలు పుడుతున్నారు. ఇంత వ్యత్యాసం మధ్య మనం చైనాతో ఎలా పోటీ పడగటం? మన దేశంలో ఇప్పుడున్న జనాభాకే సరిపడా వనరులు లేవు. దీనికి తోడు జనాభా పెరిగిపోతే మరిన్ని కష్టాలు తప్పవు. అందుకే జనాభా నియంత్రణ బిల్లును తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని గిరిరాజ్ సింగ్ అన్నారు.

Suvendu Vs Mamata: అంత దమ్ముంటే ఆపండి చూద్దాం.. మమతా బెనర్జీకి బీజేపీ ఓపెన్ ఛాలెంజ్

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘1978లో చైనా జీడీపీ ఇండియా జీడీపీ కంటే తక్కువగా ఉంది. కానీ నేడు పరిస్థితి అలా లేదు. మన దేశం కంటే చైనాది నాలుగు రెట్లు ఎక్కువ జీడీపీ ఉంది. వాళ్లు ఒకే బిడ్డ విధానంతో వారి జనాభాను 60 కోట్లకు కుదించే ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు. మనం కూడా జనాభా నియంత్రణ చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి’’ అని అన్నారు. అయితే ఈ పాలసీని పాటించని వారికి కేంద్ర మంత్రి ఒక హెచ్చరిక చేశారు. ప్రభుత్వ పాలసీని పాటించకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి ప్రభుత్వ ఫలాలు అందవని ఆయన హెచ్చరించారు.

Bus Stop in Mysuru: మసీదును తలపించే విధంగా ఉన్న బస్ స్టాప్.. బీజేపీ ఎంపీ బెదిరింపులతో రాత్రికి రాత్రే మారిన రూపు రేకలు