Suvendu Vs Mamata: అంత దమ్ముంటే ఆపండి చూద్దాం.. మమతా బెనర్జీకి బీజేపీ ఓపెన్ ఛాలెంజ్

సీఏఏ ప్రకారం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులకు దేశంలో పౌరసత్వం లభిస్తుంది. ముస్లిం అనే పేరు ఇక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతే ఈ చట్టం ప్రకారం ముస్లింలకు పౌరసత్వం ఇవ్వమని ప్రభుత్వం నేరుగానే చెప్తోందనే విమర్శలు ప్రభుత్వంపై ఉన్నాయి. కానీ, ప్రభుత్వం దీనిపై పెద్దగా స్పందించడం లేదు

Suvendu Vs Mamata: అంత దమ్ముంటే ఆపండి చూద్దాం.. మమతా బెనర్జీకి బీజేపీ ఓపెన్ ఛాలెంజ్

BJP Dares Mamata Banerjee To Stop Citizenship Law

Suvendu Vs Mamata: భారతీయ జనతా పార్టీకి తరుచూ సవాల్ చేసే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి ఈసారి బీజేపీ నుంచే పెద్ద సవాల్ ఎదురైంది. రాష్ట్రంలో ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని’(సీఏఏ) అమలు చేస్తామని, దమ్ముంటే ఆపుకొమ్మని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేంధు అధికారి దీదీకి సవాల్ విసిరారు. శనివారం నార్త్ 24 పరగణాల జిల్లాలోని ఠాకూర్ నగర్లో జరిగిన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ సవాల్ విసిరారు. ఇందులో మరో విశేషం ఏంటంటే, ఆయన ప్రసంగం చేసిన ప్రాంతంలో మటువా సామాజిక వర్గానికి చెందిన ప్రజల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వీరంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు కావడం గమనార్హం.

Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సింగపూర్‌కు లాలూ.. కిడ్నీ దానం చేస్తున్న లాలూ కూతురు

అయితే సీఏఏ కింద మటువా వర్గానికి చెందిన వారికి కూడా పౌరసత్వం కల్పిస్తామని సువేంధు హామీ ఇచ్చారు. సీఏఏ అంటే ఎవరి పౌరసత్వాన్ని తీసేయడం కాదని, వాస్తవానికి ప్రజలందరికీ అధికారిక పౌరసత్వం కల్పించడమని ఆయన పేర్కొన్నారు. ‘‘మేము దీనిపై చాలా సార్లు తీవ్రంగా చర్చించాం. అయితే దీన్ని రాష్ట్రంలో అమలు కానివ్వమని కొందరు శపథం చేస్తున్నారు. వారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ముంటే ఇది రాష్ట్రంలో అమలు కాకుండా ఆపండి చూద్దాం’’ అని సువేంధు అన్నారు. పేరు బయటికి ప్రస్తావించకపోయినా, ఆయన నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించే అన్నారు.

UP Police Tweet: ఎలాన్ మస్క్‭కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన యూపీ పోలీసులు.. ఫిదా అంటున్న నెటిజెన్లు

సీఏఏ ప్రకారం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులకు దేశంలో పౌరసత్వం లభిస్తుంది. ముస్లిం అనే పేరు ఇక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతే ఈ చట్టం ప్రకారం ముస్లింలకు పౌరసత్వం ఇవ్వమని ప్రభుత్వం నేరుగానే చెప్తోందనే విమర్శలు ప్రభుత్వంపై ఉన్నాయి. కానీ, ప్రభుత్వం దీనిపై పెద్దగా స్పందించడం లేదు. ఇక ఈ చట్టం ఆమోదం పొంది చాలా రోజులైనప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్కరికీ దీని కింద పౌరసత్వం కల్పించలేదు.

Satyendar Jain: ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‭కు జైలులో సకల వసతులు.. ఆయన కోసం 10 మంది సేవకులు!