Supreme Court : ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజేఐ నిరాకరణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ విచారణకు సంబంధించి తాత్కాలిక ఊరట ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Supreme Court : ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజేఐ నిరాకరణ

Supreme Court (1)

Supreme Court : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ విచారణకు సంబంధించి తాత్కాలిక ఊరట ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను ఈడీ కార్యాలయంలో విచారణకు పిలవడంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. తమకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని కానీ, అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ ఫోన్లు సీజ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం.. ఒక మహిళను తన ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి పిలవడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు తీసుకుంటామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. మార్చి16న విచారణకు హాజరుకావడంపై సీజేఐ ధర్మాసనం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజేఐ నిరాకరించారు. తక్షణమే విచారణ చేపట్టేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. మార్చి 24న పిటిషన్‌పై వాదనలు వింటామని సీజేఐ ధర్మాసనం తెలిపింది.

Delhi Liquor case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు మరోసారి ఈడీ విచారణకు కవిత

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై పిటీషన్ దాఖలు చేశారు. పూర్తిగా చట్ట విరుద్ధంగా… ఈడీ కార్యాలయానికి విచారణకు పిలిచారని సీజేఐ ధర్మాసనం ముందు కవిత తరపు న్యాయవాదులు  ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పును కఠినంగా అమలు చేయాలని కోరుతూ లలితా కుమారి పిటిషన్‌ వేశారు. ఒక మహిళను ఇప్పుడు ఈడీ విచారణ కోసం పిలుస్తోందని.. ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఈ పిటిషన్ పై మార్చి24 విచారణ చేపడతామని సీజేఐ తెలిపారు. సుప్రీంకోర్టులో కవితకు ఊరట లభించలేదు. దీంతో కవిత బుధవారం ఈడీ విచారణకు హాజరు కానున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఇప్పటికే 12మందిని అరెస్ట్ చేసి విచారణ జరిపింది. మార్చి 11న రామచంద్ర పిళ్లై తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించింది. పలు కీలక అంశాలపై కవితను ప్రశ్నించింది. మార్చి16న కవిత మరోసారి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. దీంతో కవిత బుధవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో బుధవారం మరోసారి అరుణ్ రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ విచారించనుంది.