Delhi Liquor case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు మరోసారి ఈడీ విచారణకు కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరుకానున్నారు.

Delhi Liquor case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు మరోసారి ఈడీ విచారణకు కవిత

Delhi Liquor case MLC Kavitha ED

Delhi Liquor case MLC Kavitha ED : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే 12మందిని అరెస్ట్ చేసి విచారణ జరిపిన ఈడీ ఈ కేసులో దూకుడు చూపిస్తోంది. మార్చి 11న రామచంద్ర పిళ్లై తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించిన ఈడీ రేపు మరోసారి కవితను విచారించనుంది. మార్చి 11న పలు కీలక అంశాలపై కవితపై పశ్నల వర్షం కురిపించిన ఈడీ 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో కవిత రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఈరోజు మరోసారి అరుణ్ రామచంద్ర పిళ్లైను, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ విచారిస్తోంది.

MLC Kavitha: ముగిసిన ఈడీ విచారణ.. 8 గంటలపాటు కవితను ప్రశ్నించిన అధికారులు

అలాగే ఈ కేసులో అత్యంత ముఖ్యమైన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను గత ఆరు రోజుల నుంచి వరుసగా విచారిస్తోంది ఈడీ. అలాగే తొమ్మిది రోజులుగా ఈడీ కష్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లైను కూడా ఈడీ అధికారులు వరసుగా ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, రూ.100 కోట్ల ముడుపుల వ్యవహరాలు, దానికి సంబంధించిన ఆధారాలు వంటి పలు కీలక అంశాలపై ఈడీ అధికారుల బృందం నిందితులను వరుసగా ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో పలు విషయాలు వెల్లడి అవుతున్నాయి. అలా దీనికి సంబంధించిన ఆధారాలను నిందితులు ధ్వంసం చేయటంపై ఎక్కువగా దృష్టి పెట్టిన ఈడీ ఆ దిశగా క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు.

Also Read..Delhi Liquor Scam : కవితను జైల్లో వేయాలంటే ఈడీకి ఇంత టైమా?పేరంటానికి పిలిచారా?ఇదంతా బీఆర్ఎస్,బీజేపీ డ్రామాలు : రేవంత్ రెడ్డి

విచారణలో వెల్లడి అయిన వివరాలను ఏప్రిల్ మొదటివారంలో రెండవ సప్లిమెంటరీ చార్జ్ షీట్ ఫైల్ చేయనుంది ఈడీ. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో 12మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ 12మంది 10మంది నిందితులు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరో 9మంది తీహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో మనీశ్ సిసోడియాను ఈరోజు కూడా ఈడీ అధికారులు తీహార్ జైల్లోనే విచారణ జరుపుతున్నారు. ఈక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మరోసారి ఈడీ రేపు (మార్చి16,2023)ప్రశ్నించనుంది. మరి రేపు విచారణకు కవిత హాజరు అవుతారా? లేదా వేరే కార్యక్రమాలు ఉన్నాయని విచారణకు వెళ్లటానికి వాయిదా అడుగుతారో వేచి చూడాలి.

Delhi Liquor scam: చిరునవ్వుతో కోర్టుకు సిసోడియా.. విచారణలో ఎమ్మెల్సీ కవిత గురించి చెప్పిన ఈడీ.. పూర్తి వివరాలు

కాగా ఢిల్లీలో మార్చి 10న పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు దీక్ష చేసిన కవిత ఆ మరునాడే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈక్రమలో మరోసారి ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నాం (మార్చి15,2023) 3గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించటానికి ఇప్పటికే కవిత ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కవిత ఆధ్వర్యంలో మధ్యాహ్నాం 3గంటలకు రీ మెరిడియన్ హోటల్ లో జరుగనున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌరసంఘాలు, మహిళా సంఘాల ప్రతినిథులు పాల్గొనున్నారు. మార్చి 11 చేపట్టిన ఒక రోజు దీక్షకు కొనసాగింపుగా కవిత ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ సమావేశం పూర్తి చేసుకుని రేపు కవిత బహుశా ఈడీ విచారణకు హాజరు అవుతారని సమాచారం.