Jantar Mantar: ధర్నాకు దిగిన మోదీ సోదరుడు

రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు, పంచదారపై కేంద్ర ప్రభుత్వం మా డీలర్లకిచ్చే కమిషన్‌లో కేజీకి 20 పైసలు మాత్రమే పెంచడం క్రూరమైన హాస్యం. రేషన్ డీలర్లను ఆర్ధిక కష్టాలనుంచి గట్టెక్కించడానికి కేంద్రం సాయం ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా డీలర్ల సంఘం నాయకులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తాం.

Jantar Mantar: ధర్నాకు దిగిన మోదీ సోదరుడు

Jantar Mantar: కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ధర్నాకు దిగారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం ధర్నా చేపట్టిన ఆయన రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే నిత్యవసరాలపై కేంద్ర ప్రభుత్వం తమకిచ్చే కమిషన్‭లో 20 పైసలు మాత్రమే తమకివ్వడం క్రూరమైన చర్య అంటూ హాస్యమంటూ వ్యాఖ్యానించడం విశేషం. రేషన్ డీలర్లను ఆర్ధిక కష్టాలనుంచి గట్టెక్కించడానికి కేంద్రం సాయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రహ్లాద్ మోదీ కొనసాగుతున్నారు. పశ్చిమబెంగాల్ తరహాలో దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న వారికి రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరల్లో బియ్యం, గోధుమలు, పంచదార, అమ్మేందుకు అనుమతినివ్వాలని అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తమ సంఘం డిమాండ్లను నెరవేర్చేందుకు ధర్నా చేపట్టారు.

Hijab Ban: కర్ణాటక హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీం విచారణ

ధర్నా ప్రదేశంలో ప్రహ్లాద్ మోదీ మీడియాతో మాట్లాడుతూ ‘‘రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు, పంచదారపై కేంద్ర ప్రభుత్వం మా డీలర్లకిచ్చే కమిషన్‌లో కేజీకి 20 పైసలు మాత్రమే పెంచడం క్రూరమైన హాస్యం. రేషన్ డీలర్లను ఆర్ధిక కష్టాలనుంచి గట్టెక్కించడానికి కేంద్రం సాయం ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా డీలర్ల సంఘం నాయకులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తాం. బుధవారం మేము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వినతి పత్రం అందజేస్తాం. అలాగే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలుస్తాం. బెంగాల్ తరహాలో దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న వారికి రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరల్లో బియ్యం, గోధుమలు, పంచదార, అమ్మేందుకు అనుమతినివ్వాలని అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. గ్యాస్ సిలెండర్లు, పప్పు దినుసులు, వంటనూనెలు కూడా రేషన్ షాపుల ద్వారా అమ్మేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్ల సంఘం మే కోరుతున్నాం’’ అని అన్నారు.

WBSSC Scam: మాజీ మంత్రి పార్థా చటర్జీపై చెప్పు విసిరన మహిళ