పెంపుడు కుక్కల కోసం వ్యక్తి ఓవర్ యాక్షన్..ప్రభుత్వానికి రూ.7లక్షలు ఫైన్

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 10:27 AM IST
పెంపుడు కుక్కల కోసం  వ్యక్తి ఓవర్ యాక్షన్..ప్రభుత్వానికి రూ.7లక్షలు ఫైన్

ముంబైలో ఓ వ్యక్తి పెంపుడు కుక్కలపై ఉన్న అతిప్రేమ వల్ల ప్రభుత్వానికి ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.7లక్షలు జరిమానా కట్టాడు. పెంపుడు కుక్కల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాం. దానికి కోసం ఎంతో ఖర్చు పెడతాం. వాటిని చూసుకోవటానికి ఓ మనిషిని పెడతాం. వాటిని  ఏసీ రూముల్లో కూడా పడుకోబెడుతుంటారు. వారి వారి ఆర్థిక స్థాయిలను బట్టి కుక్కలను చాలా అపురూపంగా చూసుకుంటుంటారు. దానికి ప్రభుత్వానికి జరిమానా కట్టటానికి సంబంధమేంటి అనుకోవచ్చు. కుక్కలపై ప్రేమ కాస్తా..చోరీకి పాల్పడేలా చేసింది అదీ అసలు విషయం.!!

వివరాల్లోకి వెళితే.. ముంబైలోని నెరుల్ సెక్టార్ 1లోని ట్విన్లాంట్ టవర్ లోని 5వ అంతస్తులో డబుల్ బెడ్ రూమ్ లో ఉంటున్న ఓ వ్యక్తి..మూడు కుక్కల్ని పెంచుకుంటున్నాడు.  తన పెంపుడు కుక్కలకు ఎటువంటి అసౌకర్యం కలగకకూడదని 24 గంటలపాటూ ఇంట్లో ఏసీలను ఆన్‌లో పెట్టాడు. దాని కోసం ఏకంగా ప్రభుత్వం విద్యుత్ ను సొంతంగా వాడేసుకున్నాడు. విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడు. దాదాపు 34 వేల 465 వందల యూనిట్ల ప్రభుత్వం విద్యుత్‌ను అక్రమంగా వాడేసుకున్నాడు. 

ఈ విషయం అధికారులకు తెలియడంతో సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజారామ్ మానే, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీమ్ పిన్హాజీరావు గైక్వాడ్ నేతృత్వంలోని  ఓ టీమ్ నెరుల్ సెక్టార్ 1లోని ట్విన్లాంట్ టవర్ లోని 5వ అంతస్తుకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.తరువాత అది నిజమేనని దృవీకరించారు. దీంతో విద్యుత్ చట్టం 2003లోని 135 సెక్షన్ (విద్యుత్ చోరీ) కింద చర్యలు తీసుకున్నారు. దాంతో రూ. 7లక్షలు చెల్లించాలని అతగాడికి ఝలక్ ఇచ్చారు. దీంతో వేరే దారిలేక అతడు ప్రభుత్వంవారు వేసిన జరిమానా మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది.  

See Also | కరోనా ఫియర్….రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్ క్రాష్