Mumbai: కొవిడ్-19, బ్లాక్ ఫంగస్, ఊపిరితిత్తుల నుంచి రక్తం.. అయినా 85రోజులు పోరాడి గెలిచిన వ్యక్తి

ముంబైలోని ఓ వ్యక్తికి 85రోజులుగా కొవిడ్ తో పోరాడాడు. దాదాపు కోలుకునే అవకాశాలు అయిపోయాయనుకుంటున్న సమయంలో వాటన్నింటినీ జయించి హీరానందనీ హాస్పిటల్ లో రికవరీ అయి ఇంటికి తిరిగొచ్చాడు.

Mumbai: కొవిడ్-19, బ్లాక్ ఫంగస్, ఊపిరితిత్తుల నుంచి రక్తం.. అయినా 85రోజులు పోరాడి గెలిచిన వ్యక్తి

Covid 19 (2)

Mumbai: ముంబైలోని ఓ వ్యక్తికి 85రోజులుగా కొవిడ్ తో పోరాడాడు. దాదాపు కోలుకునే అవకాశాలు అయిపోయాయనుకుంటున్న సమయంలో వాటన్నింటినీ జయించి హీరానందనీ హాస్పిటల్ లో రికవరీ అయి ఇంటికి తిరిగొచ్చాడు.

54సంవత్సరాల భరత్ పంచాల్ మూడు నెలల హాస్పిటల్ ట్రీట్మెంట్ తర్వాత కుటుంబాన్ని చూసి ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏప్రిల్ 8న పాంచాల్ కు జ్వరం సోకింది. వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల తర్వాత కరోనా వ్యాపించింది. నాలుగురోజుల్లోనే లక్షణాలు పెరిగి ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. వారం గ్యాప్ లోనే మెకానికల్ వెంటిలేషన్ సపోర్ట్ అవసరమైంది.

కొవిడ్ ఇన్ఫెక్షన్ చూపించే సీటీ వాల్యూ రీడింగ్ 21 నుంచి 25మధ్య చూపించింది. శరీరంలోని ఇతర అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకంది. అతని కండీషన్ దిగజారుతుండటంతో కిడ్నీ, లివర్ తో పాటు పలు అవయవాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కొవిడ్ పేషెంట్లలో ఎక్కువగా కనిపిస్తున్న బ్లాక్ ఫంగస్ కూడా వ్యాపించింది.

70రోజులుగా వెంటిలేషన్ సపోర్ట్ మీదనే ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. కొవిడ్ పేషెంట్లలో కనిపించే ప్రతి ఆరోగ్య సమస్య అతనిలో కనిపించిందని హీరానందిని హాస్పిటల్ డాక్టర్ చెప్పారు. రెమెడెసివర్ నుంచి ప్లాస్మా థెరఫీ వరకూ తెలిసిన ప్రతి టెక్నిక్ ను వాడారు డాక్టర్లు.

అతని నుంచి వస్తున్న స్పందనను ప్రతీదానిని విలువైనదిగా భావించి ప్రాణాలతో తిరిగి రావాలనే ఉద్దేశ్యంతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చివరికి అతని ఊపిరితిత్తుల నుంచి రక్తం కారడం మొదలైంది. ఇక కుటుంబం ఆశలు వదిలేసుకుంది. ఒకరోజు తర్వాత అతనిలో మార్పు వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో నుంచి కోలుకుని రికవరీ అయ్యాడు.