నా పేరు రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 09:28 AM IST
నా పేరు రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ

నా పేరు రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ నా పేరు రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత్ బచావో అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ శనివారం (డిసెంబర్ 14) రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ బచావో సభలో పాల్గొన్న సందర్భంగా రాహల్ గాంధీ ఇలా అన్నారు. దేశాన్ని..దేశంలోని ఆడబిడ్డల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

దేశంలో నిత్యావసరంగా వాడుకునే ఉల్లిపాయలు కిలో రూ.200లు అమ్ముతున్నాయనీ..ఇలాగైతే ప్రజలు ఎలా బ్రతుకుతారని..దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ నాశం చేశారనీ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో పతనమైన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వరకూ కోలుకోలేకపోయిందనీ..దీనంతటికీ ప్రభత్వం బాధత్యత వహించాలని డిమాండ్ చేశారు. మరోపక్క దేశంలోని ఆడపిల్లలు అత్యాచారాలకు, హత్యలకు గురవుతుంటే విదేశీయులు సైతం మీ ఆడపిల్లలు మీరు రక్షించుకోలేరా? అని ప్రశ్నిస్తున్నారనీ..దీనికి ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారన్నారు.

ఇన్ని దారుణాలు జరగుతుంటే తాను చేసిన ‘‘రేప్ ఇన్ ఇండియా’’ వ్యాఖ్యలపై మాత్రం బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ..క్షమాపణలు చెప్పమని అడుగుతున్నానరీ..తాను మాట్లాడినదాంట్లో తప్పేంది అని ప్రశ్నించారు. నేను క్షమాపణ చెప్పనని రాహుల్ స్పష్టం చేశారు. నిజాలు మాట్లాడినందుకు నేను క్షమాపణ చెప్పాలా? అని ప్రశ్నించారు.నా పేరు రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ నా పేరు రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కానీ దేశాన్ని రక్షించుకోవటం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారనీ ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తా దేశం కోసం పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారని రాహల్ గాంధీ అన్నారు.