Shradha Murder Case: శ్రద్ధా మృతికేసులో కిల్లర్ అఫ్తాబ్‌కు నార్కో పరీక్షలు.. కోర్టు అనుమతి

స‌హ‌జీవ‌నం చేస్తున్న శ్ర‌ద్ధా వాల్క‌ర్‌ను చంపిన కిల్ల‌ర్ అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు ఢిల్లీ పోలీసులు నార్కో ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. అఫ్తాబ్ చెప్పేదాంట్లో నిజం ఎంత ఉందో తెలుసుకునేందుకు అత‌నికి ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

Shradha Murder Case: శ్రద్ధా మృతికేసులో కిల్లర్ అఫ్తాబ్‌కు నార్కో పరీక్షలు.. కోర్టు అనుమతి

Shradha Murder Case

Shradha Murder Case: శ్రద్ధా మృతికేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మే 22న తమ గొడవ తర్వాత శ్రద్ధ ఇంటి నుంచి వెళ్లిపోయిందని నిందితుడు పోలీసులకు తెలిపాడు. అప్పటి నుంచి శ్రద్ధతో తాను టచ్‌లో లేనని, ఆమె మొబైల్‌తో మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లిందని తెలిపాడు. అఫ్తాబ్ మే 18న శ్రద్ధను గొంతు కోసి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. దాదాపు ఆరు నెలల తర్వాత నవంబర్‌లో కేసు తెరపైకి వచ్చింది. ఆ సమయానికి ఆఫ్తాబ్ శ్రద్ధ మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతాల్లో వేరువేరు ప్రాంతాల్లో పడేశాడు.

Shocking News: ఢిల్లీలో దారుణం.. యువతిని 35ముక్కలుగా నరికి నగరంలో పడేసిన మానవ మృగం

పోలీసులకు అప్తాబ్ తప్పుడు సమాచారం ఇస్తుండటంతో వారి ఖాతాల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయగా మే 26న శ్రద్ధా నెట్ బ్యాంకింగ్ ఖాతా యాప్ నుండి ఆఫ్తాబ్ ఖాతాకు రూ. 54,000 లావాదేవీ జరిగినట్లు గుర్తించారు. మే 22 తర్వాత శ్రద్ధతో టచ్‌లోలేనని ఆఫ్తాబ్ తొలుత చెప్పాడు. దీనినిబట్టి నిందితుడు అబద్ధం ఆడుతున్నట్లు గుర్తించారు. విచార‌ణ స‌మ‌యంలో హంత‌కుడు త‌ప్పుడు స‌మాచారం ఇస్తున్న‌ట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నార్కో టెస్ట్ అనుమతికోసం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలోని సాకేత్ కోర్టు.. నార్కో ప‌రీక్ష నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇచ్చింది.

Shocking News: గద్వాల జిల్లాలో విచిత్ర ఘటన.. చిన్నారి కంటి నుంచి రాళ్లు, బియ్యం గింజలు

శ్ర‌ద్ధా ఫోన్‌ను ఏం చేశాడు, ఆమెను ముక్క‌లుగా న‌రికేందుకు వాడిన క‌త్తి ఎక్క‌డ ఉందో తెలుసుకునేందుకు పోలీసులు నార్కోటెస్ట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక‌వేళ అఫ్తాబ్ మాన‌సికంగా స‌రిగా లేకుంటే అప్పుడు ఏం చేయాలో కూడా పోలీసులు ఓ నిర్ణ‌యాన్ని తీసుకోనున్నారు. గ‌తంలో కూడా ఢిల్లీ పోలీసులు సైకో అనాల‌సిస్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. గ‌త ఏడాది ఇజ్రాయిల్ ఎంబ‌సీ బ్లాస్ట్ కేసులో అరెస్టు అయిన న‌లుగురిపై సైకో అనాల‌సిస్ ప‌రీక్ష‌లు చేశారు. దాని ద్వారా వాళ్లు పాక్షికంగా మాత్ర‌మే నిజం చెబుతున్న‌ట్లు గుర్తించారు.