Shradha Murder Case: ఢిల్లీలో దారుణం.. యువతిని 35ముక్కలుగా నరికి నగరంలో పడేసిన మానవ మృగం

ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పెళ్లిచేసుకోమన్నందుకు యువతిని అతి దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని 35ముక్కలుగా నరికి 18 రోజులు పాటు ఇంటిలోని ఫ్రిజ్ లో ఉంచాడు. ప్రతీ రోజూ అర్థరాత్రి 2గంటల సమయంలో ఢిల్లీలోని మెహ్రోలీ అడవిలో ఆ ముక్కలను పడేస్తూ వచ్చాడు.

Shradha Murder Case: ఢిల్లీలో దారుణం.. యువతిని 35ముక్కలుగా నరికి నగరంలో పడేసిన మానవ మృగం

Live In Relationship

Updated On : November 16, 2022 / 3:18 PM IST

Shradha Murder Case: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పెళ్లిచేసుకోమన్నందుకు యువతిని అతి దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని 35ముక్కలుగా నరికి 18 రోజులు పాటు ఇంటిలోని ఫ్రిజ్ లో ఉంచాడు. ప్రతీ రోజూ అర్థరాత్రి 2గంటల సమయంలో ఢిల్లీలోని మెహ్రోలీ అడవిలో ఆ ముక్కలను పడేస్తూ వచ్చాడు. తన కూతురు కనిపించడం లేదంటూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా అఫ్తాబ్ అమీనా పై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో అఫ్తాబ్ ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Hijab Deaths in Iran :  ఇరాన్‌లో ‘హిజాబ్’ మరణాలు .. హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ 326 మృతి

శ్రద్ధా అనే 26యేళ్ల యువతి ముంబైలోని ఓ కంపెనీ కాల్ సెంటర్ లో పనిచేస్తుంది. అక్కడ ఆమెకు అప్తాబ్ అమీన్ పూనావాలా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు. వారి మధ్య ప్రేమ చిగురించడంతో వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే శ్రద్ధ కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోకపోవటంతో వారిద్దరు ముంబయి నుంచి ఢిల్లీకి వచ్చారు. మెహ్రౌలీలోని ఒక ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. అయితే శ్రద్ధ కుటుంబ సభ్యులు ఆమెను ఆన్‌లైన్‌లో ఫాలో అవుతూ వచ్చారు. ఆర్నెళ్ల క్రితం కూతురు ఆన్‌లైన్‌లో కనిపించక పోవటంతో అనుమానంతో శ్రద్ధ తండ్రి వికాస్ మదన్ వాకర్ ఢిల్లీ వచ్చి ఆమె ప్లాట్‌కు వెళ్లాడు. తాళంవేసి ఉండటంతో అతను మెహ్రౌలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

Elon Musk: మరోసారి కఠిన నిర్ణయం తీసుకున్న మస్క్.. 4,400 మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఔట్..!

ఢిల్లీ పోలీసులు సాంకేతిక నిఘా సహాయంతో అఫ్తాబ్ కోసం వెతకడం ప్రారంభించారు. రహస్య సమాచారం మేరకు పోలీసులు అఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, అఫ్తాబ్ తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా నిరంతరం ఒత్తిడి చేస్తుందని చెప్పాడు. దీంతో వారి మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత మేలో ఆమెను దారుణంగా హత్య చేశాడు. అయితే శ్రద్ధ మృతదేహాన్ని దాదాపు 35 ముక్కలుగా నరికాడు. ఫ్రిజ్ తీసుకొచ్చి అందులో మృతదేహం ముక్కలను ఉంచాడు. సుమారు 18 రోజుల పాటు మృతదేహం ముక్కలను అఫ్తాబ్ దాచిఉంచాడు. అతను ఆ ముక్కలను మెహ్రౌలీ అడవుల్లో విసిరేవాడు. ఇందుకోసం రాత్రి 2గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేవాడని పోలీసులు తెలిపారు. మృతురాలి మిగిలిన శరీర భాగాల కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. నిందితుడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.